తెలంగాణ మూవీ టీవీ అధ్య‌క్షుడిగా పృథ్వీ

Update: 2019-08-26 16:20 GMT
కృష్ణాన‌గ‌ర్ కాకా హోట‌ల్లో రూ.60 భోజ‌నం నుంచి ఫైవ్ స్టార్ హోట‌ల్లో ప్లేటు రూ.5000 బోజ‌నం వ‌ర‌కూ ఎదిగాన‌ని ఎలాంటి భేష‌జం లేకుండా చెబుతారు 30 ఇయ‌ర్స్ పృథ్వీ. మూడు ద‌శాబ్ధాల న‌ట ప్ర‌స్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్న త‌ర్వాత‌నే ఈ స్థాయికి చేరుకోగ‌లిగాన‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు. ఓర్పు జ‌యాన్ని ఇస్తుంద‌ని గొప్ప హోదాని తెస్తుంద‌ని పృథ్వీ విష‌యంలో ప్రూవైంది. ఇంత‌కాలం ఎంతో ఓపిక పట్టినందుకు అది స‌త్ఫ‌లితాలిస్తోంది.

మొన్న ఏపీ ఎన్నికల వేళ వైకాపా అధినాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పృథ్వీ.. పోసాని కృష్ణ‌ముర‌ళి లాంటి కొంద‌రు మ‌ద్ధ‌తుగా నిలిచారు. వైకాపా గెలుపు కోసం ప‌రిశ్ర‌మ త‌ర‌పున‌ పృథ్వీ చాలానే ప్ర‌చార సాయం చేశారు. పార్టీ కోసం అత‌డు చేసిన హార్డ్ వ‌ర్క్ చూసి వైయ‌స్ సీఎం జ‌గ‌న్ స‌ముచిత‌మైన ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఎంతో కీల‌క‌మైన ఎస్వీబీసీ ఛైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఎంక‌న్న సామి ఆశీస్సుల‌తో ఆ ప‌ద‌వి అందుకున్న‌ది మొద‌లు పృథ్వీకి మ‌హ‌ర్ధ‌శ ప‌ట్టుకుంది.

ఎస్వీబీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వితో పాటే అత‌డికి ఇప్పుడు ఆర్టిస్టుల్లో విపరీత‌మైన గౌర‌వం పెరిగింది. అందుకే ఆయ‌న‌క‌ 730 మంది ఆర్టిస్టులు ఉన్న టీఎంటీఏయు అధ్య‌క్ష‌ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది. అసోసియేష‌న్ మెంబ‌ర్స్ బంప‌ర్ మెజారిటీతో పృథ్వీ ప్యానెల్ ని గెలిపించారు. ఆదివారం నాడు హైద‌రాబాద్ పిలించాంబ‌ర్ లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గెలుపు అనంత‌రం మీడియాతో మాట్లాడిన పృథ్వీ.. ఎల‌క్ష‌న్ ముందు ఇచ్చిన హామీల‌న్నిటినీ త‌క్ష‌ణ‌మే నెర‌వేరుస్తాన‌ని మాటిచ్చారు. ముఖ్యంగా ప‌రిశ్ర‌మ నుంచి ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను త‌రిమేస్తాన‌ని ఆర్టిస్టుల‌ను ఆదుకుంటాన‌ని అన్నారు. వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం.. కేసీఆర్ ప్ర‌భుత్వం తో ఆర్టిస్టుల హెల్త్ స్కీమ్ గురించి మాట్లాడతాన‌ని ప్రామిస్ చేశారు. అలాగే మూవీ ఆర్టిస్టుల సంఘం(మా)తో పోలిస్తే చాలా చిన్న అసోసియేష‌న్ మాది. కానీ ఏదో ఒక‌రోజు ఆ స్థాయిలో నిల‌బడేందుకు కృషి చేస్తాం.. అని తెలిపారు.


Tags:    

Similar News