భావన పెళ్ళి రూమర్లకు చెక్ చెప్పండి

Update: 2017-12-16 01:30 GMT

హీరోయిన్ భావన. ఈ మధ్య కాలంలో కొన్ని దురదృష్టకర పరిణామాలతో ఈమె పేరు చాలా హైలైట్ అయ్యింది. అప్పుడెప్పుడే తెలుగులో శ్రీకాంత్ - గోపిచంద్ - నితిన్ వంటి హీరోలతో సినిమాలు చేసిన భావన.. ఆ తరువాత తెలుగులో పెద్దగా కనిపించలేదులే. కాని మలయాళంలో మాత్రం బాగా బిజీ అయిపోయింది. అయితే ఇప్పుడు ఈమె పెళ్ళి ఆగిపోయిందని వస్తున్న వార్తలకు ఇక చెక్ చెప్పక తప్పదు.

ఆ మధ్యన ప్రొడ్యూసర్ నవీన్ తో హీరోయిన్ భావన ఎంగేజ్ మెంట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల పాటు చెట్టాల్ పట్టాల్ అంటూ తిరిగిన భావన అండ్ నవీన్.. ఈ సంవత్సరం మార్చి నెలలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే అక్టోబర్ లో జరుగుతుందని అనుకున్న వీరి వివాహం మాత్రం జరగలేదు. దానితో అందరూ ఈ పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందంటూ చాలా కామెంట్లు చేశారు. అలాగే భావన నుండి నవీన్ నుండి ఎటువంటి ప్రకటన కూడా వెలువడకపోవడంతో.. నిజంగానే పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందని అందరూ అనుకున్నారు. కాని ఇప్పుడు ఓ లేటెస్ట్ న్యూస్ వినిపిస్తోంది.

డిసెంబర్ 22న కేరళలోని త్రిస్సూర్ లో భావన్ అండ్ నవీన్ ల పెళ్ళి కుటుంబ సభ్యుల మధ్యన గ్రాండ్ గా జరగనున్నట్లు తెలుస్తోంది. కేవలం కొంతమంది సినిమా సెలబ్రిటీలను మాత్రమే భావన ఇన్వయిట్ చేస్తోందట. మీడియాను కూడా ఈ ఈవెంట్ నుండి కాస్త దూరంగానే ఉంచనున్నారట.
Tags:    

Similar News