ప్ర‌పంచం ప్ర‌మాదంలో..గ్ర‌హం స‌మ‌స్య‌ల్లో! భూమీప‌డ్నేక‌ర్ ఆవేద‌న‌

Update: 2023-06-06 11:00 GMT
ప‌ర్యావ‌ర‌ణం విష‌యంలో సెల‌బ్రిటీలు ఎంత శ్ర‌ద్దతో వ్య‌వ‌హరిస్తారో చాలాసార్లు చూసాం. ప్ర‌భుత్వం ప‌ర్యావ‌ర‌ణానికి సంబంధించి ఎలాంటి కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టినా త‌మ వంతు బాధ్య‌త‌గా ముందుకొచ్చి ప్ర‌చారం చేస్తుంటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క‌లు నాట‌డం...క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ లో  భాగంగా రోడ్ల ని క్లీన్ చేయ‌డం వంటివి చూసాం. ఇవ‌న్నీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన త‌ర్వాత సెల‌బ్రిటీలు  ముందుకొచ్చారు. పనిలో ప‌నిగా త‌మ సినిమాల్ని ప్ర‌మోట్ చేసుకున్నారు.

ఆరక‌రంగా ఒకేసారి రెండు ర‌కాల ప‌నులు ముగించారు. మ‌రి మొన్న జూన్ 5న ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ఎంత మంది సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో స్పందించారు?  ప‌ర్యావ‌ర‌ణం స‌మ‌తుల్యం దెబ్బ‌తింటుందని వాపోయియిన సెల‌బ్రిటీలు ఎంత మంది అంటే? వేళ్ల‌పై లెక్కించ వ‌చ్చు. అలాంటి వారిలో బాలీవుడ్ న‌టి భూమీ ప‌డ్నేక‌ర్ ఒక‌రు. ఆమె ఎంతో బాధ్య‌త‌తో ప‌ర్యావ‌ర‌ణం దినోత్స‌వం సంద‌ర్భంగా ఏకంగా 3000 మొక్క‌ల్ని నాటి ఆద‌ర్శంగా నిలించింది.

ప‌ర్యావ‌ర‌ణం దినోత్స‌వం సంద‌ర్భంగా ఐక్య‌రాజ్య‌స‌మితి ఏటా అవ‌గాహ‌న క‌ల్పిస్తూ ఎన్నో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంది.  దీనిలో భాగంగా భూమీ ప‌డ్నేక‌ర్ త‌న బాధ్య‌త‌గా ప్ర‌పంచ మొచ్చుకునే గొప్ప ప‌ని చేసింది.  ఈసంద‌ర్బంగా ప‌ర్యావ‌ర‌ణాన్ని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.  `మాన‌వాళి చేసే ఎన్నో ప‌నులు వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌తింటుంది.  వాతావ‌ర‌ణం ఎన్నో ర‌కాల మార్పుల‌కు ప్ర‌త్య‌క్షంగానో..ప‌రోక్షంగానో కార‌ణ‌మ‌వుతున్నాం. ఇప్పుడు ప్ర‌పంచం ప్ర‌మాదంలో ప‌డింది. గ్ర‌హం స‌మ‌స్య‌ల్లో ఉంది.

చెట్ట‌ను న‌రికేస్తున్నారు. దీంతో ఆక్సిజ‌న్ స‌ర‌ఫరా త‌గ్గిపోతుంది.  ఇప్పుడీ నరికివేత ఆప‌క‌పోతే మ‌రింత ప్ర‌మాదంలో ప‌డుతాం.  అలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ముందుగా చెట్ల‌ను న‌ర‌క‌డం ఆపాలి. కొత్త  మొక్క‌ల‌ను నాటాలి. మ‌న కోసం..మ‌న త‌ర్వాతి త‌రం కోసం అంతా విధిగా చేయాల్సిన ప‌ని ఇది.  మీరంతా అందుకు స‌హ‌క‌రిస్తార‌ని ఆశిస్తున్నాను. నేను మాత్రం ప్ర‌తీ ఏడాది ఇలాంటి కార్య‌క్ర‌మంలో పాల్గొంటాను`  అని అంది. ఇక అమ్మ‌డి కెరీర్ సంగ‌తి చూస్తే  `భ‌క్ష‌క్`..`ది లేడీ కిల్ల‌ర్`.. `మేరి ప‌ట్నీ కా` రీమేక్ లో న‌టిస్తోంది.

Similar News