ఫస్ట్ లుక్: 'భళా తందనాన'లో ఫియర్ లెస్ బ్యూటిఫుల్ 'శశి రేఖ'గా కేథ‌రిన్

Update: 2021-09-10 06:28 GMT
'చమ్మక్ చల్లో' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అందాల ముద్దుగుమ్మ కేథ‌రిన్ థ్రెసా. వెంటనే 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో అవకాశం అందుకున్న ఈ బ్యూటీ.. 'పైసా' 'సరైనోడు' 'గౌతమ్ నందా' 'నేనే రాజు నేనే మంత్రి' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. తెలుగులో చివరగా 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఈ భామ 'భళా తందనాన' 'బింబిసార' వంటి రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈరోజు (సెప్టెంబర్ 10) కేథ‌రిన్ థ్రెసా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ''భళా తందనాన'' చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసింది.

''భళా తందనాన'' చిత్రంలో వర్సటైల్ యాక్టర్ శ్రీ విష్ణు సరసన క్యాథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో శశి రేఖ అనే పియర్ లెస్ యువతి పాత్రలో ఆమె కనిపించనుందని మేకర్స్ పేర్కొన్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో క్యాథరిన్ థ్రెసా పింక్ శారీ - స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి చేతిలో మొబైల్ పట్టుకొని ఉంది. ఇందులో ఆమె బ్యూటిఫుల్ గా ఉండటమే కాకుండా ధైర్యవంతురాలైన తన పాత్ర యాటిట్యూడ్ ని చూపిస్తోంది. మరి ఈ సినిమాతో అమ్మడికి ఆశించిన గుర్తింపు వస్తుందేమో చూడాలి.

కాగా, 'బాణం' ఫేమ్ చైతన్య దంతులూరి 'భళా తందనాన' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా అని.. శ్రీ విష్ణు ఇంతకు ముందెన్నడూ పోషించని సరికొత్త పాత్రలో కనిపించనున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ రామచంద్రరాజు (గరుడ) ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. శ్రీకాంత్ విస్సా కథా రచయితగా పని చేస్తున్న ఈ చిత్రానికి గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.


Tags:    

Similar News