అగ్రహీరోల సరసన గ్లామరస్ నాయికగా నటిస్తూనే అప్పుడప్పుడు నాయికా ప్రధాన చిత్రాలతో ఆకట్టుకోవడంలో నయనతార తర్వాతే. అనుష్క సైతం తన కెరీర్ లో అరుంధతి-పంచాక్షరి- భాగమతి లాంటి నాయికా ప్రధాన చిత్రాలతో మెప్పించినా సైజ్ జీరో లాంటి ప్రయోగం చేసినా కానీ గ్లామరస్ నాయికగా తనకు వచ్చిన అవకాశాలను విడిచిపెట్టలేదు.
అయితే కీర్తి సురేష్ కూడా అదే బాటలో వెళ్లాలనుకున్నా కానీ పప్పులుడకడం లేదు. తనకు ఎందుకనో నాయికా ప్రధాన చిత్రాలు కలిసి రావడం లేదు. తాజాగా `రివాల్వర్ రీటా` పోస్టర్ ని కీర్తి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో నాయికాప్రధాన పాత్రను పోషిస్తోందని పోస్టర్ వెల్లడిస్తోంది. అయితే కీర్తి ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకుందా? అంటే.. ఇది సరికాదని విమర్శించేవాళ్లు లేకపోలేదు. చాలా మంది కథానాయికలు నాయికా ప్రధాన పాత్రలలో నటించి చేతులు కాల్చుకుంటున్నారు. ఇటీవల మణికర్ణిక-తలైవి- ధాకడ్ లాంటి ప్రయోగాలతో కంగన పరిస్థితి ఏమైందో తెలిసినదే. కీర్తి సన్నివేశం అందుకు విరుద్ధంగా లేదు. `మహానటి` అద్భుతమైన హిట్ అయిన తర్వాత వరుసగా నాయికా ప్రధాన పాత్రల్లో నటించింది కీర్తి. పెంగ్విన్ - మిస్ ఇండియా - చిన్ని వంటి మహిళా ఆధారిత చిత్రాలతో అభిమానుల ముందుకు వచ్చినా ఏవీ సరిగా ఆడలేదు.
ఇంతలోనే మరోసారి `రివాల్వర్ రీటా` అంటూ బరిలో దిగింది. ఇందులో కీర్తి టైటిల్ రోల్ లో నటిస్తోంది. రీటా చుట్టూ కథ తిరుగుతుంది. కీర్తి ఎంత బాగా నటిస్తుంది? టాంబోయిష్ పాత్రలో రాణిస్తుందా? అన్నది అటుంచితే కలిసి రాని జానర్ నే మళ్లీ ఎందుకు ఎంపిక చేసుకుంటోంది? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కీర్తి కూడా కంగనలా యాక్షన్ క్వీన్ అవ్వాలనుకుంటుందా? అంటూ కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వరుసగా ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో సత్తా చాటాలని ప్రయత్నించి చేతులు కాల్చుకున్న కంగనను చూసి అయినా కీర్తి నేర్చుకోలేదా? అంటూ కొందరు విశ్లేషకులు చురకలు వేస్తున్నారు. అయితే అగ్రహీరోల సినిమాల్లో అవకాశాలు లేకపోవడం వల్లనే ఇలా చేస్తోందని చెబుతున్న వారు లేకపోలేదు. మరి ఇన్ని సందేహాలకు మహానటి ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి.