కృతి సనోన్.. వన్ నేనొక్కడినే చిత్రంలో మహేష్ బాబు సరసన చేసిన హీరోయిన్. ఇంట్రడక్షన్ లోనే టాలీవుడ్ రాజకుమారుడుతో చేయడం.. ఇప్పుడు బాలీవుడ్ బాద్ షా నటిస్తున్న దిల్ వాలేలో నటిస్తోంది. బాలీవుడ్ లో హీరోపంటి చిత్రంలో అడుగుపెట్టిన కృతి.. ఆ మూవీతో రెండు అవార్డులు కూడా దక్కించుకుంది. కెరీర్ గ్రాఫ్ బాగుండడంతో.. ఈ మోడల్ కి క్రేజ్ విపరీతంగా పెరుగుతోంది.
ప్రస్తుతం టైటాన్ రాగ వాచ్ కు బ్రాండ్ ఎండార్సింగ్ కు.. కృతి సనోన్ ను ఎంచుకున్నారు. టాటా సంస్థకు చెందిన కంపెనీతో ఎండార్స్ మెంట్ కుదుర్చుకోవడమంటే మాటలు కాదు. ఇదే కాదు. ఇప్పటికే పారాచూట్ జాస్మిన్, అమెరికన్ స్వాన్ లతోపాటు - ఓ చాకొలేట్ కంపెనీ - కోలా బ్రాండ్ కు ప్రచారకర్తగా చేస్తోంది.
గతంలో అనేక నగరాల్లో టిస్సాట్ వాచ్ లను లాంఛ్ చేసిన హిస్టరీ కూడా కృతి సనోన్ కెరీర్ లో ఉంది. చేస్తున్నవి సెలక్టెడ్ మూవీసే అయినా.. ఈ అమ్మడి గ్రాఫ్ మాత్రం అలా పైకెళ్లిపోతోంది. మంచి ఒడ్డూ - పొడవు కూడా ఉంటుంది కదా.. స్టార్ స్టేటస్ రూట్ లోనే ఉంది. లేకపోతే.. ఓ వైపు కత్రినాకైఫ్ టైటాన్ కు ప్రచారం చేస్తుండగా.. ఇప్పుడు కృతి సనోన్ ను కూడా ఎంచుకోవడమేంటి చెప్పండి.