పిక్‌ టాక్‌ : ఈ ఖిలాడి అందాలు మతి పోగొట్టేస్తున్నాయి

Update: 2022-09-04 03:30 GMT
అక్కినేని హీరో సుశాంత్ నటించిన ఇచట వాహనాలు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. మొదటి సినిమాతోనే నటిగా మంచి పేరును దక్కించుకున్న ఈ అమ్మడు ముందు ముందు మంచి ఆఫర్లు దక్కించుకుంటుందని అంతా భావించారు. అనుకున్నట్లుగానే రవితేజకి జోడీగా ఖిలాడి సినిమాలో ఈ అమ్మడు నటించింది.

సినిమాలో ఆమె పాత్ర బాగానే ఉన్నా సినిమా కమర్షియల్ గా నిరాశపరచడంతో ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. బుల్లి తెర నుండి వెండి తెరకు వచ్చిన ఈ అమ్మడు మెల్ల మెల్లగా కెరీర్ లో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం హిట్‌ 2 సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు తమిళంలో కూడా ఒక సినిమాను కమిట్ అయ్యిందని సమాచారం అందుతోంది.

ఒక వైపు మెల్లగా సినిమాలు చేస్తూ ఉన్న ఈ అమ్మడు మరో వైపు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత విషయంలో జెట్‌ స్పీడ్ తో దూసుకు పోతుంది.

రెగ్యులర్ గా అందాలను ఆరబోస్తూ ఈ అమ్మడు సోషల్‌ మీడియా ట్రెండ్ లో ఉంటుంది. తాజాగా ఈ ఫోటోలను ఈ అమ్మడు షేర్‌ చేసి తన ఫాలోవర్స్ కి మంచి వినోదాన్ని అందించింది.

క్లీ వేజ్ షో తో పాటు థైస్ ని ఎక్స్ పోజ్ చేస్తూ ఈ అమ్మడు చేసిన అందాల ఆరబోతకు ఈ అమ్మడి అభిమానులు ఫిదా అవుతున్నారు. తెలుగు తో పాటు ముందు ముందు ఈ అమ్మడు తమిళం లో కూడా బిజీ అవుతుందని.. ఈ అమ్మడి అందం అందరిని మెప్పిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News