దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఓవైపు గ్లామర్ రోల్స్ చేస్తూనే.. మరోవైపు కంటెంట్ ఓరియంటెడ్ చిత్రాలు మరియు మహిళా ప్రాధాన్యత సినిమాలతో సందడి చూస్తూ వస్తోంది. ఇందుకుగాను ఆమె భారీ స్థాయిలోనే పారితోషకం అందుకుంటోంది.
ఒకప్పుడు నయనతార ఒక్కో సినిమాకు రూ. 3 - 4 కోట్ల వరకూ రెమ్యునరేషన్ గా తీసుకుంటుందనే టాక్ ఉంది. దీనికి ఆమె కొన్ని సొంత కండిషన్స్ కూడా పెడుతుంది. మీడియా ప్రమోషన్లకు రానని ముందే క్లియర్ గా మేకర్స్ చెప్తుంది. దానికి ఓకే అంటేనే అడ్వాన్స్ తీసుకొని సినిమాకు సైన్ చేస్తుంది. తెలుగులో నయన్ కు ఆఫర్స్ తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని ఇండస్ట్రీలో చెప్పుకుంటుంటారు.
అయితే ఇటీవలే నయనతార పెళ్లి చేసుకుంది. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్న తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలో అడుగుపెట్టింది. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పెళ్ళైన హీరోయిన్లకు డిమాండ్ కాస్త తగ్గుతుంది. కానీ నయన్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు.
పెళ్లి తర్వాత కూడా నయనతార కు ఎప్పటిలాగే వరుసగా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. కాకపోతే సీనియర్ బ్యూటీ డిమాండ్ చేస్తున్న అమౌంట్ కారణంగా కొన్ని ప్రాజెక్ట్స్ వెనక్కి వెళ్లిపోతున్నాయని టాక్ వినిపిస్తోంది.
నయన్ రెమ్యునరేషన్ విషయంలో ఇప్పుడు కూడా ఏమాత్రం రాజీ పడడం లేదని తెలుస్తోంది. ఇంతకుముందు కంటే ఎక్కువే డిమాండ్ చేస్తోందట. ఇటీవల ఓ సీనియర్ హీరో పక్కన నటింపజేయాలని ఓ నిర్మాత నయన్ ని సంప్రదించగా.. ఆమె కోట్ చేసిన రేటు చూసి వెనుకడుగు వేయాల్సి వచ్చిందట.
నయనతార ఆ హీరో సరసన నటించాడని రూ. 7-8 కోట్లు పారితోషకం డిమాండ్ చేసిందట. ఆమె వ్యక్తిగత సిబ్బంది మరియు ఇతర ఖర్చులు పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 10 కోట్ల వరకూ అయ్యే పరిస్థితి ఉంది. ఇది ఏ సౌత్ హీరోయిన్ కూడా తీసుకోని రెమ్యునరేషన్. దీనికి షాక్ తిన్న నిర్మాత.. అంత మొత్తం ఇచ్చుకోలేనంటూ వెనక్కి తగ్గారట.
ఇదిలా ఉంటే నయన్ ఇకపై మూవీ ప్రమోషన్స్ లో కూడా భాగం అవుతుందని.. అందుకే ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందనే ఓ రూమర్ కూడా చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజమెంతో తెలియదు కాని.. పారితోషకం విషయంలో కచ్చితంగా ఉండే నయన్.. పెళ్లి తర్వాత కూడా అదే విధంగా ఉంటోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఇకపోతే నయనతార ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో కీలక పాత్ర పోషించింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన తెలుగు సినిమా ఇది. కాకపోతే ఇందులో ఆమెది హీరోయిన్ రోల్ కాదు. అయిప్పటికీ కథానాయిక స్థాయిలోనే పారితోషకం అందుకుందని టాక్. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఇదే క్రమంలో షారుక్ ఖాన్ - అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కే 'జవాన్' సినిమాతో నయన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఇక 'గోల్డ్' 'లయన్' 'కనెక్ట్' 'ఇరైవాన్' వంటి పలు తమిళ మలయాళ సినిమాలో స్టార్ హీరోయిన్ లైనప్ లో ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.