ఆ రెండు క్వాలిటీస్ ఉండే వ్య‌క్తినే పెళ్లి చేసుకుంటా: స‌దా

Update: 2022-08-21 08:30 GMT
సీనియ‌ర్ న‌టి స‌దా గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మహారాష్ట్రలో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ `జయం` మూవీతో సినీ కెరీర్ ను ప్రారంభించింది. నితిన్ హీరోగా  తేజ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2002లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. డ‌బ్యూ మూవీతోనే సూప‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న‌ స‌దా.. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసింది.

తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టించింది. `అపరిచితుడు` వంటి బిగ్గెస్ట్ హిట్ త‌ర్వాత స‌దా రేంజ్ మ‌రింత పెరిగింది. అయితే కెరీర్ ఊపందుకుంటున్న త‌రుణంలో స‌దా తల్లి క్యాన్సర్ బారిన ప‌డ్డారు. ఆ సమయంలో స‌దా సినిమా అవకాశాలన్నింటినీ పక్కన పెట్టేసింది. అసలు అవతలి వాళ్ళు ఎవరు? ఏ బ్యానర్‌? కథేంటి అన్న విషయాలు కూడా పట్టించుకోకుండా అన్ని ప్రాజెక్ట్స్ కి నో చెప్పింది.

దాంతో ఆమె కెరీర్ క్ర‌మంగా డౌన్ అయిపోయింది. మ‌ళ్లీ కొన్నాళ్ల‌కు సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా.. ఆమెకు స‌రైన ఆఫ‌ర్లు రాలేదు. ప్ర‌స్తుతం యూట్యూబ్ తో పాటు పలు టీవీ షోల్లో అల‌రిస్తున్న ఈ బ్యూటీ.. రీసెంట్ గా `హలో వరల్డ్` అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది. అయితే ఈ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా స‌దా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది.

ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకుంది. ముఖ్యంగా పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. త‌న‌కు కాబోయే వాడు ఎలా ఉండాలో కూడా వివ‌రించింది. స‌దా మాట్లాడుతూ.. `నా యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేసిన‌ప్పుడు చాలా మంది ప్లీజ్ పెళ్లి చేసుకోండి అంటూ స‌ల‌హా ఇచ్చారు. మ‌న జీవితంపై అలాంటి కామెంట్స్ చేసే హ‌క్కుని వారికెవ‌రిచ్చారు. అయినా ఇప్పుడు ప‌ది పెళ్లిళ్లు అవుతుంటే అందులో ఐదు జంట‌లైనా మ్యారెజ్ త‌ర్వాత  హ్యాపీగా ఉండ‌టం లేదు.

నా జీవితాన్ని నేను సంతోషంగా గ‌డ‌పాలిన అనుకుంటున్నాను. అలా అని మ‌న సంతోషం కోసం ఇత‌రుల‌పై ఆధాప‌డి పెళ్లి చేసుకుంటే.. మ‌న ఒత్తిడిని కూడా వారే భ‌రిస్తూ చ‌చ్చిపోతారు. అంద‌కే నేను పెళ్లి చేసుకోవాల‌నుకునే వ్య‌క్తి ధ‌న‌వంతుడు కాన‌క్క‌ర్లేదు. కానీ ఒక‌రిపై ఆధార‌ప‌డ‌కుండా ఉంటే చాలు. నా సంపాదన‌పైనో, మ‌రొక‌రి సంపాద‌న పైనో ఆధార‌ప‌డ‌కూడ‌ద‌నేది నా అభిప్రాయం. అలాగే నాకు కాబోయే వాడు వెగ‌న్ (శాఖాహారి)గా ఉండాలి. ఈ రెండు క్వాలిటీస్ ఉండే వ్య‌క్తినే పెళ్లి చేసుకుంటా` అంటూ స‌దా చెప్పుకొచ్చింది.

అలాగే సినీ ఇండ‌స్ట్రీలో హిట్లు, ఫ్లాపుల‌ను స‌మానంగా స్వీక‌రించాల‌ని, స‌క్సెస్ వ‌చ్చిన‌ప్పుడు హ్యాపీగా, ఫెయిల్యూర్ వ‌చ్చిన‌ప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం కరెక్ట్ కాదని స‌దా చెప్పుకొచ్చింది. ఇక ఇటీవ‌ల విడుద‌లైన `మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం` సినిమాలో `రారా రెడ్డి’ స్పెష‌ల్ సాంగ్ ను స‌దా రిజెక్ట్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని.. అస‌లు త‌న వ‌ద్దకు ఆ ఆఫ‌ర్ రానేలేద‌ని స‌దా తాజాగా స్ప‌ష్టం చేసింది.
Tags:    

Similar News