శ్రియ కూతురు అప్పుడే ఇంత పెద్దగా అయ్యిందా!

Update: 2022-09-01 13:40 GMT
హీరోయిన్ శ్రియ మొన్నటి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. ఇటీవల కూడా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాలో ఈ అమ్మడు కీలకమైన గెస్ట్‌ రోల్‌ లో కనిపించిన విషయం తెల్సిందే. తెలుగు తో పాటు వరుసగా తమిళం.. హిందీ ఇతర భాషల్లో సినిమాల్లో నటిస్తూనే ఉంది. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా హీరోయిన్ గా ఈ అమ్మడు నటిస్తూనే ఉంది.

కరోనా సమయంలో గుట్టు చప్పుడు కాకుండా గర్భవతి అయ్యి ఏకంగా డెలివరీ అయిన తర్వాత తాను తల్లిని అయ్యాను అంటూ ప్రకటించిన శ్రియ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తన కూతురు తో ఉన్న ఫోటోలను రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తూ అందరిని ఎంటర్‌ టైన్ చేస్తోంది. ఒక వైపు అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ మరో వైపు అందమైన తన కూతురు ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంది.

తాజాగా శ్రియ తన కూతురు ఫోటోలను షేర్‌ చేయడంతో చాలా మంది అప్పుడే ఈ చిన్నారి ఇంత పెద్దగా అయ్యిందా అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. మరీ ఇంత స్పీడ్‌ గా ఈ పాప పెరుగుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తల్లి మాదిరిగా చాలా అందంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు క్యూట్‌ పాప అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి శ్రియ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసే ప్రతి ఒక్క ఫోటో కూడా నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. ఇన్‌ స్టా లో 3.5 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న శ్రియ ఇప్పటికి కూడా తెలుగు మరియు ఇతర భాషల్లో సినిమాలను చేస్తూ బిజీగానే ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.శ్రియ కూతురు రాధ ఇప్పటికే సెలబ్రిటీ అయ్యింది. ఆమె ను అభిమానించే వారు లక్షల్లో ఉన్నారు. ప్రతి ఫోటోలో కూడా ఆమె పెరుగుదల కనిపిస్తుందని శ్రియ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
Tags:    

Similar News