ఆ ఇద్ద‌రు పొట్టోళ్లే కానీ మ‌హా గ‌ట్టోళ్లు!

Update: 2022-07-23 12:30 GMT
టాలీవుడ్ లో ఆ ఇద్ద‌రి స్టార్ హీరోయిన్ల క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్నారు. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది. వాళ్లే సినిమాకి ఓ బ్రాండ్ గా మారిపోతున్నారు. సినిమాలో ఆ హీరోయిన్ ఉంటే హిట్ అనే మాట త‌ప్ప  మ‌రో మాట లేదు. ఇందులో ఓ హీరోయిన్ అయితే ఏకంగా  హీరోల్నే డామినేట్ చేస్తుంది.

స్టార్ హీరోల ఆఫ‌ర్ల‌నే రిజెక్ట్ చేసే స్థాయికి చేరుకుంది. ఆ హీరోయిన్ విష‌యంలో డైరెక్ట‌ర్లు ఆమె చెప్పిన‌ట్లు చేయాలి త‌ప్ప‌..వాళ్లు చెప్పిన‌ట్లు చేయ‌దు. అంత‌గా త‌న బ్రాండ్ మార్కెట్ లో వ‌ర్కౌట్ అవుతుంది. కోలీవుడ్ లో  లేడీ ఓరియేంటెడ్ పాత్ర‌ల‌కు సైతం ఇటీవ‌లే  ప్ర‌మోట్   అయింది. త‌న‌లో యాక్టింగ్ స్కిల్స్..డాన్సింగ్ ట్యాలెంట్ మాత్ర‌మే బ్యూటీని అగ్ర‌ప‌థాన నిల‌బెట్టాయి.

ఇక మ‌రో హీరోయిన్ చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చినా నేడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. టాలీవుడ్ ఆఫ‌ర్ల‌నే కాద‌నే స్థాయికి రీచ్ అయింది. ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లోనూ  బిజీ అవుతోంది. వ‌రుస‌గా హిందీ అవ‌కాశాలు అమ్మ‌డి ఇంటి త‌లుత‌ట్టుకుంటూ మ‌రీ వ‌స్తున్నాయి.  ఈ నేప‌థ్యంలో వే ఆఫ్ స్టైల్లో ఎన్నో మార్పులొచ్చాయి. బాలీవుడ్  అభిరుచికి త‌గ్గ‌ట్టు మౌల్డ్ అవుతుంది. డి జైన‌ర్ ఎంపిక‌ల్లో ఔరా అనిపిస్తుంది. వీలైనంత‌గా అందాల విందుకు పెద్ద పీట వేస్తుంది.

ఇక ఆ ఇద్ద‌రి మ‌ధ్య పోలిక చూస్తే భామా మ‌ణులిద్ద‌రు ఎత్తు..బ‌రువు  ప‌రంగా దాదాపు స‌రిస‌మానం. క్రేజ్ ప‌రంగా ఓ హీరోయిన్ బాలీవుడ్ లో బిజీ అవుతుంటే ..మ‌రో హీరోయిన్ టాలీవుడ్..కోలీవుడ్ ల‌లో దూసుకుపోతుంది. అయితే గ్లామ‌ర్ ట్రీట్ ప‌రంగా చూస్తే గ‌నుక ఓ హీరోయిన్ మ‌రో హీరోయిన్ కి పూర్తి విరుద్దం అని చెప్పాలి. ఇద్ద‌రి మ‌ధ్య ఆ విష‌యంలో చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తుంది.

పొట్టి నిక్క‌ర్లు..అందాల ఆర‌బోత అంటే ? ఆ హీరోయిన్ అస్స‌లు ఒప్పుకోదు. కొన్ని కండీష‌న్స్ తో మాత్ర‌మే మ్యాక‌ప్ వేసుకుంటాన‌ని..పాత్ర‌ల కోసం ..అవ‌కాశాల కోసం త‌న స్థాయికి త‌గ్గించుకోన‌ని నిర్మొహ మాటంగా చెప్పేస్తుంది. కానీ మ‌రో హీరోయిన్ మాత్రం వృత్తి కి పూర్తిగా న్యాయం మాత్ర‌మే చేయాల‌ని నిరంత‌రం ప‌రిత‌పిస్తుంది.

వాస్త‌వానికి ఈ భామ కూడా కెరీర్ ఆరంభంలో ప‌రిమితులు విధించుకున్న‌ట్లే కనిపించింది. కానీ కాలం తెచ్చిన మార్పుల‌తో ఛేంజ్ అవ్వాల్సి వ‌చ్చింది. ఏదిఏమైనా ఆ ఇద్ద‌రు మాత్రం పొట్టిగా ఉన్నా మ‌హా గ‌ట్టోళ్లు అన్న‌ది వాస్త‌వం.
Tags:    

Similar News