హీరోలను మాత్రమే అలా పిలుస్తారు.. స్టార్ బ్యూటీ అప్సెట్!

Update: 2022-07-24 13:30 GMT
సినిమా ప్రపంచంలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుంది అనేది చాలామంది హీరోయిన్స్ వాదన. ఇదివరకే చాలా విషయాల్లో తమను తక్కువ స్థాయిలో ట్రీట్ చేస్తున్నారు అని కొంతమంది గ్లామరస్ హీరోయిన్స్ కూడా ఆరోపణలు చేశారు. ఇక కొందరు అయితే డైరెక్ట్ గా హీరోల పేర్లు కూడా చెప్పి ఊహించని విధంగా విమర్శలు కూడా గుప్పించారు.

ఈ తరుణంలో అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేసే తారా సుతారియా కూడా మరొకసారి సినిమా ప్రపంచంలో ఉన్న పురుషాధిక్యత గురించి ఊహించని విధంగా స్పందించింది. త్వరలోనే ఈ బ్యూటీ నటించిన ఏక్ విలన్ రిటర్న్స్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మోహిత్‌ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూలై 29న విడుదల కానుండగా సినిమా ప్రమోషన్స్ కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న హీరోయిన్ తారా అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీ విషయాల గురించి కూడా గట్టిగానే వివరణ ఇస్తుంది.

ఇక రీసెంట్గా మరోసారి ఈ బ్యూటీ సినిమా ప్రపంచంలో ఒక విభేదం అనేది చాలా ఎక్కువగా ఉంది అని అందరికీ ఇక్కడ సమన్యాయం లేదు అని కూడా ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా హీరోలను మాత్రమే సినీ పరిశ్రమలో సార్ అని పిలిచి ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉంటారు అని అదే తరహా గౌరవం మాత్రం హీరోయిన్స్ కు అందించడంలో విఫలమవుతున్నారు అని పేర్కొంది.  

కెమెరామెన్ కూడా అదే తరహాలో ప్రవర్తిస్తూ ఉండడంతో  మిగతావారు కూడా హీరోయిన్స్ అంటే చాలా తక్కువగానే చిన్న చూపుతో చూడడం ఏమాత్రం సమన్యాయం కాదు అని ఆమె తన వివరణ ఇచ్చింది. గతంలో కొంతమంది హీరోయిన్స్ కూడా ఒక సినిమా సక్సెస్ లో హీరోతో పాటు హీరోయిన్ కూడా ఎంతో ముఖ్యమైనప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు లభించడం లేదు అని అన్నారు ముఖ్యంగా పారితోషం విషయంలో అయితే పురుషాధిక్యత ఊహించని స్థాయికి పెరిగిపోయింది అని కూడా విమర్శలు చేస్తున్నారు.
Tags:    

Similar News