పెళ్లికి ముందురోజు అబ్బాయిలతో ట్రిప్ అంట!
'హార్ట్ ఎటాక్'.. 'క్షణం' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన భామ అదా శర్మ. అయితే ఈమధ్య తెలుగులో కాస్త స్లో అయింది. ఈమధ్యే విడుదలైన రాజశేఖర్ చిత్రం 'కల్కి' తప్ప అదా మరే ఇతర టాలీవుడ్ సినిమాలోనూ నటించలేదు. బాలీవుడ్ లో మాత్రం మూడు సినిమాలతో బిజీగా ఉంది. ఈ సినిమాలే కాకుండా 'ది హాలిడే' అనే వెబ్ సీరీస్ లో కూడా నటించింది.
ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అదా ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ఈ వెబ్ సీరీస్ లో మెహెక్ అనే అమాయి పాత్రలో నటిస్తోందట. ఈ మెహెక్ పాత్ర తన పెళ్ళికి ముందు రోజు ముగ్గురు చిన్ననాటి బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి బ్యాచిలరెట్ పార్టీ చేసుకుంటుందట. "మన సినిమాల్లో కానీ.. నిజజీవితంలో కానీ ఎక్కువగా అబ్బాయిల గ్యాంగు లేదా అమ్మాయిల బ్యాచ్ హాలిడే ట్రిప్ కు వెళ్తారు. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్" అని చెప్పుకొచ్చింది.
తన జీవితంలో హాలిడే ట్రిప్స్ గురించి మాట్లాడుతూ తన ఫస్ట్ ట్రిప్ మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఫ్యామిలీతో హవాయికి వెళ్లడం అని.. అది లీలగా తనకు గుర్తుందని చెప్పింది. ఎప్పుడూ సింగిల్ గా వెకేషన్ కు వెళ్లలేదని తెలిపింది. గోవాకు వెళ్లినా.. ఎక్కడికి వెళ్లినా తన బెస్ట్ ఫ్రెండ్స్ తోనే వెళ్తానని వెల్లడించింది. 'ది హాలిడే' ఈ వెబ్ సీరీస్ జూమ్ స్టూడియోస్ వారి వెబ్ ఛానెల్ లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది. అదా శర్మతో పాటు అషిమ్ గులాటి.. ప్రియాంక్ శర్మ ఈ వెబ్ సీరీస్ లో ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.