లేడీస్‌ కు అదాశర్మ వార్నింగ్‌

Update: 2019-06-21 07:36 GMT
ఉత్తరాది ముద్దుగుమ్మ అదాశర్మ తెలుగు ప్రేక్షకులకు 'హార్ట్‌ ఎటాక్‌' చిత్రంతో పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ చిత్రం నిరాశ పర్చడంతో తెలుగులో అదాశర్మకు స్టార్‌ స్టేటస్‌ దక్కలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా కూడా అర కొరగానే గుర్తింపు దక్కింది. సినిమాలతో కంటే సోషల్‌ మీడియాతోనే ఈ అమ్మడు ఎక్కువగా గుర్తింపు దక్కించుకుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫొటోలతో ఈ అమ్మడు ఎప్పటికప్పుడు ట్రెండ్‌ అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఈమె ఒక హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ కోసం తయారవుతోంది.

హాలీవుడ్‌ వెబ్‌ సిరీస్‌ 'ది హాలీడే' కోసం అదాశర్మ విభిన్నమైన హెయిర్‌ స్టైల్‌ ను ట్రై చేసింది. మూడు రంగుల హెయిర్‌ తో ఆకట్టుకుంటోంది. పర్పల్‌.. పింక్‌.. ఆరెంజ్‌ కలర్స్‌ జట్టుతో అదాశర్మ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తరహా హెయిర్‌ స్టైల్‌ కు అమ్మాయిలు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ హెయిర్‌ స్టైల్‌ అదాశర్మకు క్రేజ్‌ ను తెచ్చి పెట్టింది. దాంతో ఈమె ఆ హెయిర్‌ స్టైల్‌ పై కాపీ రైట్స్‌ తనవి అంటూ సరదాగా పోస్ట్‌ చేసింది.

తాను 'ది హాలీడే' సినిమా కోసం చేసుకున్న హెయిర్‌ స్టైల్‌ ఇది. అమ్మాయిలు ఎవరు దీన్ని ట్రై చేయరాదు. ఈ హెయిర్‌ స్టైల్‌ పై పూర్తి కాపీ రైట్స్‌ తనవే అంటూ సోషల్‌ మీడియాలో ఫన్నీగా అమ్మాయిలకు వార్నింగ్‌ ఇచ్చింది. మొత్తానికి ట్రెండ్‌ ను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు స్టైల్స్‌ ను కొత్తగా ట్రై చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న అదాశర్మ నటిగా మాత్రం అంతంత మాత్రంగానే ఆకట్టుకుంటుంది. మరి ది హాలీడే వెబ్‌ సిరీస్‌ తో అయినా అదాశర్మకు సక్సెస్‌ దక్కేనా చూడాలి.
Tags:    

Similar News