సినిమా విడుదల సందర్భంగా సెలవులు ప్రకటించడం ఈ మధ్యకాలంలో మొదలైంది! సుమారు పదేళ్ల గ్యాప్ తర్వాత తన 150వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు చిరంజీవి వస్తోన్న సందర్భంగా ఒక కంపెనీ జనవరి 11న సెలవు దినంగా ప్రకటించిన సంగతీ తెలిసిందే. అదైతే భారీ మూవీ, మెగా స్టార్ కం బ్యాక్ ఫిల్మ్ కదా.. చిరు మేనియాలో అదొకటి అని అంతా అనుకున్నారు కానీ... తాజాగా మరో చిన్న సినిమాకు ఏకంగా పోలీసులకే సెలవు ప్రకటించారు!
సంక్రాంతి బరిలో నిలిచిన ఆర్ నారాయణ మూర్తి.. "హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య" సినిమా తాజాగా తెలంగాణలో విడుదలయిన సంగతి తెలిసిందే. తెలంగాణానే ఎందుకంటే... ఈ సినిమా నైజాంలో పరిమిత థియేటర్లలో మాత్రమే విడుదలయ్యింది. ఇక ఏపీ సంగతంటారా... ఆ మాటే లేదు! ఈ విషయం మీద ఇప్పటికే నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమా విషయంలో అదిలాబాద్ జిల్లా ఎస్పీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.
ఈ సినిమాను జిల్లా వ్యాప్తంగా ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అంతా తమ కుటుంబ సభ్యులతో సహా చూసేందుకు వీలుగా అదిలాబాద్ ఎస్పీ శ్రీనివాస్ ఈ రోజు సెలవు ప్రకటించారు. దీంతో.. జిల్లాలోని మొత్తం 230 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఈ రోజు (19-01-2017 గురువారం) సినిమాను చూసే వీలు లభించనుంది. దీనికోసం అదిలాబాద్ లో ప్రత్యేక షోను ప్రదర్శిస్తున్నారు. ఒక చిన్న సినిమాను చూసేందుకు పోలీసుశాఖ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరమనే చెప్పాలి. అయితే... ఈ విషయంపై నారాయణమూర్తి స్పందించాల్సి ఉంది!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/