యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మూడు భారీ చిత్రాల్లో “ఆదిపురుష్” కూడా ఒకటి.బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కించనున్న చిత్రం రామాయణ ఆధారంగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం నుంచి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంది. సినిమా ప్రారంభమైన రోజే ఫైర్ యాక్సిడెంట్ కావటంతో షూటింగ్ డిలే అయ్యింది. ఆ తరువాత సైఫ్ అలీ ఖాన్ వివాదం స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఆర్టిస్ట్‌ల డేట్స్ కుదరక మెల్లిగా షూటింగ్ చేశారు. షెడ్యూల్ కాస్త గాడిలో పడింది అనుకున్న సమయానికి ముంబైలో లాక్ డౌన్ పెట్టేశారు. దాంతో ప్రభాస్ సహా మూవీ టీమ్ అంతా ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. సర్లే ఎక్కువ శాతం గ్రీన్ మ్యాట్ లోనే కదా షూటింగ్ అని హైదరాబాద్‌లో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు మూవీ టీమ్.
రామోజీ ఫిలిం సిటీలో సెట్ కూడా రెడీ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా లాక్ డౌన్ పెట్టేయటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఎక్కుడుంది ఈ సమస్య అనేది అర్దం కాక టీమ్ తల పట్టుకుంటున్నారట. రామాయణం,శ్రీరాముడుకు సంభందించిన సబ్జెక్టు కదా ..ఆ వైపు నుంచి ఏదన్నా దోషం ఉందేమో అని అనుమానిస్తున్నారట. దాంతో ఈ సమస్యలను తొలిగించుకోవటానికి ఈ సినిమా నిర్మాతలు ఏదన్నా హోమం లాంటిది చేస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. కాస్త కేసులు నెమ్మిదించాక ఏదన్నా సమస్యలు ఉంటే పోయేలా భగవంతుడుని వేడుకుని అప్పుడు షూట్ మొదలెడితే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చారని చెప్పుకుంటున్నారు. ఇది గాలి వార్తేనా లేక నిజమా అని తెలియాల్సి ఉంది.
ఇక ఇది మైథలాజికల్ మూవీ కావటంతో భారీగా క్రూ వర్క్ చేయాల్సి ఉంటుంది. లాక్ డౌన్ టైమ్‌లో అంత మందితో షూటింగ్ చేయటం కష్టమే కాబట్టి పరిస్దితులు కాస్త సెట్ అయ్యే వరకు వెయిట్ చేయటమే బెటర్ అని ఫీల్ అవుతున్నారట.
ఈ భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ రామునిగా కనిపించనుండగా 'ఆదిపురుష్'లో సీతగా కృతి సనన్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ రావణ పాత్రలో కనిపించనున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి క్యాస్టింగ్ పరంగా ఇవి మాత్రమే అధికారికంగా బయటకొచ్చిన వార్తలు. అయితే అంగద్ బేడీ ఇంద్రజిత్ గా, లక్ష్మణుడి పాత్రకు సోనూకి టిటులీ ఫేం.. బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్‌ని ఎంపిక చేశారు.
ఆదిపురుష్ త్రిడిని అత్యంత భారీ బడ్జెట్‌తో టీ సిరీస్ నిర్మించనుంది. సుమారు 300 కోట్ల వ్యయంతో టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2022 ఆగస్ట్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.