'హిట్ 2' టీజర్ అప్డేట్: హిట్ యూనివర్స్ లో ఈసారి వైలెన్స్ కాస్త ఎక్కువే..!
ఇటీవల 'మేజర్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టిన టాలెంటెడ్ హీరో అడివి శేష్.. ఇప్పుడు ''హిట్ 2'' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించేందుకు వస్తున్నాడు. ఇందులో కృష్ణ దేవ్ అలియాస్ కె.డి. అనే హొమిసైడ్ ఇంటర్వెన్షన్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
'హిట్' సినిమాకు ఫ్రాంచైజీగా ''హిట్ 2: ది సెకండ్ కేస్'' రూపొందుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో 'హిట్' ఫస్ట్ పార్ట్ తో ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సీక్వెల్ తెరకెక్కింది.
నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి త్రిపిర్నేని ఈ సీట్ ఎడ్జ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆలస్యమైంది. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు.
''హిట్ 2'' చిత్రాన్ని డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు ఫస్ట్ గ్లింప్స్ కు మంచి స్పందన లభించగా.. ఈ రోజు, 'వరల్డ్ ఆఫ్ HIT' పేరుతో టీజర్ అనౌన్స్ మెంట్ వీడియోని వదలడం ద్వారా మేకర్స్ ప్రమోషన్ ను ప్రారంభించారు.
ఇందులో డైరెక్టర్ శైలేష్ కొలను 'HIT verse' అంటూ 'హిట్ యూనివర్స్' ని పరిచయం చేశారు. హొమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ ఎలా పుట్టింది.. ఇందులోకి ఆఫీసర్స్ ఎలా వచ్చారనేది చెప్పారు. పార్ట్-1 నుండి చిన్న కనెక్షన్లతో 'HIT 2' లో ఎలాంటి ఎగ్జైటింగ్ విషయాలు ఉంటాయనేది అతను చర్చించాడు.
ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్ నటిస్తే.. సెకండ్ కేసులోకి అడివి శేష్ ఎందుకు వచ్చాడనేది తెలిపారు. 'హిట్ యూనివర్స్' లో శేష్ తో పాటుగా విశ్వక్ కూడా భాగమేనని.. వీరంతా కలిసి పెద్ద కేసు సాల్వ్ చేసేటప్పుడు విశ్వక్ స్టోరీ కూడా కంప్లీట్ అవుతుందని తెలిపారు.
'హిట్ 2' చూడాలంటే 'హిట్ 1' చూడాల్సిన అవసరం లేదు.. కానీ, ఫస్ట్ పార్ట్ చూస్తే ఈ సెకండ్ పార్ట్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని.. ఎందుకంటే చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ కనెక్షన్స్ ఉంటాయని పేర్కొన్నారు. చివరగా, అడివి శేష్ మరియు దర్శకుడు కలిసి నవంబర్ 3న టీజర్ విడుదల అవుతుందని ప్రకటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
''హిట్ 2: ది సెకండ్ కేస్'' సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా.. కోమలీ ప్రసాద్ - రావు రమేష్ - పోసాని కృష్ణ మురళి - భాను చందర్ - తనికెళ్ళ భరణి - శ్రీకాంత్ మాగంటి ఇతర పాత్రలు పోషించారు. జాన్ స్టీవర్ట్ ఏడూరి ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View