'మేజర్' హిట్ తో యంగ్ హీరో అడవి శేష్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కింది. ముంబై తాజ్ దాడుల్లో అమరుడైన సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ కావడంతోనే రీల్ మేజర్ కి ఈ రేంజ్లో ఐడెంటిటీ వచ్చింది. అంతకు ముందు కొన్ని హిట్ సినిమాల్లో నటించాడు. కానీ ఏ సినిమా తీసుకురాని గుర్తింపు ఒక్క బయోపిక్ శేష్ కి జీవితాంతం గుర్తిండిపోయేలా తెచ్చిపెట్టింది.
ఇప్పుడు శేషు పేరు అన్ని భాషల్లోనూ మారు మ్రోగిపోతుంది. యంగ్ హీరో గురించి గూగుల్ లో సెర్చ్ చేయడం ఎక్కువైంది. అతని గతం ..ఎక్కడ నుంచి వచ్చాడు? బ్యాక్ గ్రౌండ్ ఏంటి? వంటి విషయాలు తెలుసుకోవడానికి నెటి జనులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే శేషు గురించి సాధారణంగా అందరూ ఏమనుకుంటున్నారో? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
అవును ఈ విషయాన్ని స్వయంగా శేషునే రివీల్ చేసాడు. శేషుని అంతా హిందీ కుర్రాడు.. ఉత్తరాది రాష్ర్టాల నుంచి వచ్చి తెలుగు సినిమాలు చేస్తున్నాడని ...ఇక్కడ సెటిలైన వ్యక్తి అని అనుకుంటున్నారుట. 'మేజర్' తర్వాత ఆ రకమైన ప్రచారం మరింత ఎక్కువైందని శేష్ అంటున్నాడు. 'పంజా' సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ సైతం తనని హిందీ వాడు అనుకుని హిందీలో మాట్లాడటం మొదలు పెట్టారుట.
చివరికి తాను తెలుగు వాడ్ని అని చెప్పడంతో పవన్ షాక్ అయ్యారుట. అలాగే 'మేజర్' సినిమా చూసిన జనం కొంత మంది బయట చూసేసరికి హిందీ వాడ్ని అని హిందీలోనే మాట్లాడుతున్నారుట. కానీ తనకి హిందీ పూర్తిగా రాకపోవడంతో ఏం మాట్లాడుతున్నారో? అర్ధం కాని సన్నివేశం ఏర్పడుతుందని అంటున్నాడు. తన చర్మం తెల్ల తోలు..గెటప్ చూసి హిందీ వాడు అనుకుంటున్నారని నా భాధంతా అనేసాడు.
తెలుగు వాడిని అయినా నేను తెలుగొడ్ని అని నాకు నేనుగానే చెప్పుకోవాల్సి వస్తోంది. నన్ను పరిశ్రమ కూడా తెలుగు వాడిగా గుర్తించడం లేదు. ఇంకా చాలా మంది నార్త్ కుర్రాడిని అనే అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా...హిందీ వాడినే అనుకున్నా..నేను మాత్రం ఇండియన్ అని గర్వంగా చెబుతాను. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి కాబట్టి ఏ భాష వాడిని అనుకున్నా.. ఏ రాష్ర్టం వాడిని అనుకున్నా..నేను మాత్రం భారతీయుడ్ని అని శేషు చెప్పకొచ్చారు.
అలాగే నటుడిగా తన కెరీర్ ని టర్న్ చేసి చిత్రం 'బలుపు' అంటున్నాడు. 'బలుపు' లో తన పాత్ర నచ్చకపోవడంతో..ఇండస్ర్టీకి ఎందుకొచ్చాను? ఏ చేస్తున్నాను? అని రియలైజ్ అయ్యాను. ఆనాటి నుంచి కెరీర్ పై మరింత కసిగా పరుగు మొదలు పెట్టాను. పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తపడ్డాను. నలుగురితో నారాయణ..కులంతో గోవిందా అనడం! కన్నా తనలో ''ప్రత్యేకత ఉండేలా చూసుకున్నాను.. ఆఆలోచన..ప్రయత్నాలే తనలో కొత్త నటుడ్ని ఆవిషర్కించడానికి కారణాలు అయ్యాయి అంటున్నాడు.