#ఎస్ ఎస్ ఎంబీ 29 త‌ర్వాత జ‌క్క‌న్న ప్రాజెక్ట్ ఇదేనా?

Update: 2022-12-17 14:30 GMT
ఒక సినిమా పూర్తిచేసి రిలీజ్ అయిన త‌ర్వాత గానీ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌ట‌న చేయ‌రు. క‌నీసం వివ‌రాలు కూడా ఎక్క‌డా లీక్ కాకుండా జాగ్ర‌త్త ప‌డేవారు.  ఊహ‌కి కూడా రానంత గోప్య‌త వ‌హించేవారు. కానీ జ‌క్క‌న్న లోనే చాలా మార్పులొచ్చా యి. ఒక సినిమా సెట్ లో ఉండ‌గానే మ‌రో సినిమాను ప్ర‌క‌టించే అన‌వాయితీ మొద‌లు పెట్టారు.

`ఆర్ ఆర్ ఆర్` సెట్ లో ఉండ‌గానే...త‌దుప‌రి సినిమా సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో ఉంటుంద‌ని ముందే హింట్ ఇచ్చారు. అటుపై  `ఆర్ ఆర్ ఆర్` స‌రిగ్గా రిలీజ్ కిమందు ప్రాజెక్ట్ క‌న్ప‌మ్ చేసారు. ఇది నిజంగా అభిమానుల‌కు షాకింగ్ నే. బాహుబ‌లి వ‌ర‌కూ కొత్త సినిమా ప్ర‌క‌ట‌న విష‌యంలో గోప్య‌త వ‌హించే జ‌క్క‌న్న ఇలా మారిపోయాడు?  ఏంటి అని  అంతా షాక్ అవుతున్నారు.

తాజాగా మ‌రో బిగ్ షాక్ కూడా ఇవ్వ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హేష్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డానికి ముందే మ‌రొ  కొత్త సినిమా ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదని విపిపిస్తుంది. ఎస్ ఎస్ ఎంబీ 29వ సినిమా పూర్త‌యిన వెంట‌నే జ‌క్క‌న్న పాన్ వ‌ర‌ల్డ్ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్  చేస్తున్న‌ట్లు లీకుందుతున్నాయి. డార్లింగ్ ప్ర‌భాస్....యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో భారీ మ‌ల్టీస్టార‌ర్ కి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది.

దీన్నీ పాన్ వ‌ర‌ల్డ్ గా మ‌లిచి ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడిగా ఖ్యాతికెక్కాల‌ని భారీ స్కెచ్ వేస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే మ‌హేష్ తో హాలీవుడ్ రేంజ్ పాన్ వ‌ర‌ల్డ్ సినిమా చేస్తున్న‌ట్లు ఖ‌రారైంది. ఆప్రిక‌న్ అడ‌వుల నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు. ఈ మ‌హాయ‌జ్ఞం 2023 లో ప్రారంభం అవుతుంది.

అటుపై ఎప్పుడు పూర్తిచేసి రిలీజ్ చేస్తారు అన్న‌ది వ‌చ్చే ఏడాది తెలుస్తుంది. ఆ స‌మ‌యంలో ఈ పాన్ వ‌ర‌ల్డ్ మ‌ల్టీస్టార‌ర్ పైనా మ‌రింత స‌మాచారం తెలిసే అవ‌కాశం ఉంది. ఏది ఏమైనా జ‌క్క‌న్న కాంపౌండ్ నుంచి  ముందొస్తు స‌మాచారం అభిమాన‌ల‌కు బిగ్  స‌ర్ ప్రైజ్.   

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News