నాటీ బోయ్ ఫ్రెండ్ కోసం సిగ‌ప‌ట్లు ప‌ట్టిన‌ స్టార్ హీరోయిన్లు!

Update: 2020-05-15 05:15 GMT
ముద్దుగుమ్మ‌ల మ‌ధ్య క్యాట్ ఫైట్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. క‌లిసి ఒకే సినిమాలో న‌టించ‌క‌పోయినా.. గొడ‌వ‌లు మాత్రం కామ‌న్. జ‌స్ట్ బోయ్ ఫ్రెండ్ ఎక్స్ ఛేంజీ అయితే చాలు. ఇక ఆ ఇద్ద‌రి మ‌ధ్యా రుబాబ్ మామూలుగా ఉండ‌దు. ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. అలాంటి క‌ల్లోల‌మే జ‌మానా కాలంలో మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్.. కిల్లింగ్ హాట్ హీరోయిన్ మ‌నీషా కొయిరాలా మ‌ధ్య త‌ప్ప‌లేదు.

ఆ ఇద్ద‌రూ ప్రియుడి కోసం ఒక‌రి కొప్పు ఒక‌రు ప‌ట్టుకున్నంత ప‌ని చేశారు. ప‌బ్లిక్ లోనే తిట్టుకున్నారు. మంచినీటి కుళాయి ద‌గ్గ‌ర అమ్మ‌ణ్ణుల్లా కొప్పులు ప‌ట్టుకోక‌పోయినా ఆల్మోస్ట్ అంత పెద్ద గొడవే అయ్యింది. ఈర్ష్య‌లు.. ఈగోలు.. గొడ‌వ‌లు.. వెక్కి వెక్కి ఏడ‌వ‌డాలు.. స‌ల‌స‌లా కాగిపోవ‌డాలు ఇన్ని ఎమోష‌న్స్ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా క‌నిపించాయి. అస‌లింత‌కీ ఏమైంది? అంటే .. ప్ర‌ముఖ స్టైలిష్ట్ కం మోడ‌ల్ రాజీవ్ ముల్ చందానీతో అప్ప‌టికే ఎఫైర్ సాగిస్తోంది నేపాళీ బ్యూటీ మ‌నీషా కొయిలారా.

ఆ క్ర‌మంలోనే ఐశ్వ‌ర్యారాయ్ ముంబై ర్యాంప్ నుంచి న‌ట‌న‌లో ప్ర‌వేశించింది. అటుపై నెమ్మ‌దిగా రాజీవ్ ముల్ చందానీతో ప‌రిచ‌య‌మైంది. అప్ప‌టికే అత‌డు టాప్ మోడ‌ల్. ఆ క్ర‌మంలోనే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స్నేహం చిగురించి ప్రేమాయ‌ణానికి దారి తీసింది. ఇది తెలిసిన మ‌నీషా అటుపై ఐష్ ని బ‌హిరంగ వేదిక‌ల‌ పైనే తిట్టేసింది. త‌న బోయ్ ఫ్రెండ్ ని లాక్కుంద‌ని విమ‌ర్శించింది. ఆ ఎపిసోడ్ తో ఐష్ కూడా అందుకు ధీటుగానే స‌మాధాన‌మిచ్చింది. త‌న ప్రేలాప‌న వ‌ల్ల నేను చాలా హ‌ర్ట‌య్యాను. రాజీవ్ నేను మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని ఐష్ చెప్పుకొచ్చింది. అయితే అప్ప‌టికే మ‌నీషా మ‌న‌సు విరిగిపోయి రాజీవ్ తో స్నేహం క‌ట్ చేసింది. ఆ క్ర‌మంలోనే ప‌లువురితో మ‌నీషా ఎఫైర్ల సంగ‌తి తెలిసిందే.

మ‌నీషా అన్న మాట‌తో తాను ఎంతో ఏడ్చాన‌ని కూడా ఐశ్వ‌ర్యారాయ్ అప్ప‌ట్లో అన‌డం చూస్తే ఆ ఇద్ద‌రి మ‌ధ్యా గొడ‌వ ఎంత‌వ‌ర‌కూ వెళ్లిందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌నీషాతో గొడ‌వ‌య్యాక‌.. రాజీవ్ తో తొమ్మిది నెల‌ల స్నేహ‌నికి క‌టీఫ్ చెప్పేసింది ఐష్‌. కాల‌క్ర‌మంలో ప‌లు వేదిక‌ల‌పై సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తిసారీ ఒక‌రినొక‌రు గుర్తు చేసుకుని తిట్టేసుకోవ‌డం ముంబై మీడియాకి బోలెడంత వినోదం పంచింది. 1999 డిసెంబ‌ర్ నాటి ఘ‌ట‌న‌లివి. వీటిపై అప్ప‌ట్లో ప‌లు మ్యాగ‌జైన్ల‌లో వేడెక్కించే క‌థ‌నాలొచ్చాయి. దాదాపు పాతికేళ్లు అయ్యింది ఇప్ప‌టికి. ఇన్నేళ్ల‌లో ఐష్‌.. మ‌నీషా కొయిలారా ఎఫైర్ల సంగ‌తి తెలిసిందే. ఐశ్వ‌ర్యారాయ్ అటుపై స‌ల్మాన్ ఖాన్.. వివేక్ ఒబేరాయ్ లాంటి స్టార్ హీరోల‌తో ఎఫైర్స్ సాగించి చివ‌రికి అభిషేక్ బ‌చ్చ న్ ని పెళ్లాడింది. మ‌నీషా కొయిరాలా  తెలుగు హీరో నాగార్జున స‌హా ప‌లువురు బాలీవుడ్ స్టార్ల‌తో ఎఫైర్లు సాగించింది. నేపాళీ రాజును పెళ్లాడి అటుపైనా బ్రేక‌ప్ అయిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News