మెగా మేన‌ల్లుడు కోసం కాంతార దిగాడు!

Update: 2022-10-13 16:30 GMT
మెగా మేన‌ల్లుడు సాయితేజ్ కి స‌రైన స‌క్సెస్ ప‌డి చాలా కాల‌మ‌వుతోంది. ఆ మ‌ధ్య 'రిప‌బ్లిక్' తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంలందుకున్నా క‌మ‌ర్శియ‌ల్ గా  సినిమా రాణించ‌లేదు. దీంతో సాయితేజ్ రేసులో  బాగా వెనుక‌బ‌డ్డట్లే క‌నిపిస్తుంది. స‌క్సెస్ అనివార్య‌మైన స‌మ‌యం ఇది. స‌రైన హిట్ కొట్టి రేసులోకి రావాల్సిన అవ‌స‌రం ఉంది. మున‌ప‌టంత వేగంగా క‌మిట్ అవ్వ‌కుండా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఆయ‌న‌ క‌థానాయ‌కుడిగా కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇదొక మిస్టిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ సినిమా. పూర్తిగా కాన్సెప్ట్ బేస్ట్ క‌థ‌. ఇటీవ‌ల కాలంలో ఇలాంటి క‌థ‌ల‌కు ఆద‌ర‌ణ బాగుంది. ఈనేప‌థ్యంలో సాయితేజ్ గేర్ మార్చిన‌ట్లు క‌నిపిస్తుంది. స‌క్సెస్ ఫార్ములాపై దృష్టి పెట్టి ముందుకెళ్తున్నాడు.

ఈ నేప‌థ్యంలో సంగీత ద‌ర్శ‌కుడి విష‌యంలో మెగా హీరో అంతే జాగ్ర‌త్త వ‌హిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. తెలుగు కంపోజ‌ర్ల‌ని సైతం ప‌క్క‌న‌బెట్టి ఏకంగా క‌న్న‌డ మ్యూజిక్ డైరెక్ట‌ర్ నే రంగంలోకి దించుతున్నాడు. అత‌నో అజ‌నీష్ లోక్ నాథ్. ఇటీవ‌ల కాలంలో అజ‌నీష్ కంపోజ్ చేసిన చిత్రాలు మ్యూజిక‌ల్ గా మంచి హిట్ అయ్యాయి.

'విక్రాంత్ రోణా'...'కాంతార' వంటి చిత్రాలు స్థానికంగా పెద్ద హిట్ అయ్యాయి. ఆ చిత్రాల నేప‌థ్య సంగీతం సినిమాకి పిల్ల‌ర్ లా నిలిచింది. ముఖ్యంగా కాంతార క‌న్న‌డ‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. 16 కోట్ల బ‌డ్జెట్ తో  నిర్మించిన‌ సినిమా అక్క‌డ ఏకంగా 60 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది. పాట‌లు స‌హా నేప‌థ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. ఆర‌కంగా స‌క్సెస్ లో మ్యూజిక్ కీ రోల్ పోషించింది.

ఇదే చిత్రాన్ని తెలుగులో అల్లు అర‌వింద్ అనువ‌దిస్తున్నారు. ఇలా అన్ని ర‌కాలుగా  అజ‌నీష్ ట్రాక్ పాజిటివ్ గా ఉండ‌టంతో సాయితేజ్   అత‌న్నే రంగంలోకి దించుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. అయితే ఆయ‌న ఎంట్రీ వెనుక అర‌వింద్ సాబ్ కీల‌క పాత్ర పోషించి ఉంటార‌ని గెసెస్ తెర‌పైకి వ‌స్తున్నాయి. ఆయ‌న స‌ల‌హా మేర‌కే ద‌ర్శ‌క‌-నిర్మాత‌-హీరోలు అజ‌నీష్ ని తీసుకున్న‌ట్లు వినిపిస్తుంది.

స‌ల‌హా ఎవ‌రిదైనా  మ్యాట‌ర్ ఉన్న కంపోజర్  కాబ‌ట్టి తిరుగుండ‌దు. ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.  ఇందులో సాయితేజ్ కి జోడీగా సంయుక్తా మీన‌న్ న‌టిస్తోంది. సుకుమార్ రైటింగ్స్ లో క‌లిసి శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర  పతాకంపై బి.వి.ఎస్. ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News