పూరి జగన్నాథ్ కొడుకు పూరి ఆకాశ్ చిన్నప్పట్నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. పూరి తీసిన సినిమా సినిమాలతో పాటు ‘ధోని’ అనే సినిమాలో లీడ్ రోల్ చేసి.. చిన్నతనంలోనే మంచి పేరు సంపాదించాడు ఆకాశ్. ‘ఆంధ్రాపోరి’ అనే సినిమాతో హీరో టీనేజీలోనే హీరో కూడా అయిపోయాడు ఆకాశ్. ఐతే ఆ సినిమా చేదు అనుభవాన్ని మిగల్చడంతో మళ్లీ అలాంటి ప్రయత్నాలు చేయలేదు. మూణ్నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చి తన దర్శకత్వంలో కొడుకుని పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేయించాలని పూరి నిర్ణయించుకున్నాడు. దీంతో రెండేళ్లుగా ఆకాశ్ బయటెక్కడా కనిపించట్లేదు. నటనలో శిక్షణ తీసుకుంటూ హీరోగా తనను తాను తీర్చిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాడు.
ఐతే పూరి కొత్త సినిమా ‘రోగ్’ ఆడియో వేడుకలో ఆకాశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇంతకుముందు పిల్లాడిలా కనిపించిన ఆకాశ్.. ఈ వేడుకలో పెద్దోడైపోయి దర్శనమిచ్చాడు. అతడి రూపం మారింది. వాయిస్ మారింది. మాటల్లో కొంచెం పెద్దరికం వచ్చింది. విశేషం ఏంటంటే.. ‘రోగ్’ సినిమాకు ఆకాశ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశాడట. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా చాలా నేర్చుకున్నానని.. ఇది తనకు గొప్ప లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పాడు ఆకాశ్. ఇన్నాళ్లూ తనకు తల్లిదండ్రులు.. స్నేహితులు.. బంధువులు మాత్రమే ఉండేవారని.. ఐతే ‘రోగ్’ సినిమాతో ఇషాన్ రూపంలో తనకు గొప్ప అన్నయ్య దొరికాడని అన్నాడు ఆకాశ్. ‘‘ఇప్పటిదాకా ఇక్కడ పొడిచిన వాళ్లందరూ ఎక్కడి నుంచో వచ్చినవాళ్లే’’ అంటూ ‘రోగ్’ సినిమాలో తన తండ్రి ఒక డైలాగ్ రాశాడని.. ఇషాన్ కూడా ఆ కోవకే చెందుతాడని.. తెలుగు ఇండస్ట్రీలో జెండా పాతేస్తాడని ఆకాశ్ పేర్కొనడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/