ఏఎన్నార్ అంత కూల్‌ గానా?

Update: 2018-09-02 05:42 GMT
అఖిల్ న‌టించిన తొలి రెండు సినిమాలు ఆశించిన ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోవ‌డం అక్కినేని కాంపౌండ్‌కి పెద్ద నిరాశ‌నే మిగిల్చింది. అందుకే మూడో సినిమాతో ఎట్టిప‌రిస్థితిలో బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటాల‌ని, ప్రేక్ష‌కాభిమానుల్ని మెప్పించాల‌ని అఖిల్ ఎంత‌గానో శ్ర‌మిస్తున్నారు. న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడు - తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి వినిపించిన క‌థ‌కు ఓకే చెప్పి కాన్ఫిడెంట్‌ గా సెట్స్‌ పైకి వెళ్లిపోయారు. లండ‌న్ ప‌రిస‌రాల్లో స‌ర‌దా ట్రిప్‌ లా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఈ టీమ్ షూటింగ్ పూర్తి చేస్తోంది. ఇప్ప‌టికే మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

ఈ సినిమా గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుస్తూనే ఉన్నాయి. విదేశీ బ్యాక్ డ్రాప్ ల‌వ్‌ స్టోరి కాబ‌ట్టి ఓవ‌ర్సీస్‌ లో అఖిల్ మార్కెట్‌ కి క‌లిసొస్తుంద‌న్న అంచ‌నాలు ఏర్పడ్డాయి. మారిన ట్రెండ్‌ లో కేవ‌లం ఓవ‌ర్సీస్ నుంచే పెట్టుబ‌డులు తిరిగొచ్చేస్తున్నాయి. ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాల‌కు అక్క‌డినుంచే రిక‌వ‌రీ సాధ్య‌మవుతోంది. అందుకు త‌గ్గ‌ట్టే క‌థ‌ల్ని ద‌ర్శ‌కులు ప్లాన్ చేస్తున్నారు. ఇక‌పోతే లండ‌న్ బేస్డ్‌ లో సినిమా తీస్తే అందులోంచి స‌గం సొమ్ముల్ని ఆ ప్ర‌భుత్వం తిరిగి ఇస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు బివిఎస్ ఎన్‌ - బాపినీడు టీమ్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సాగుతోంది.

ఆస‌క్తిక‌రంగా ఈ సినిమాకి సంబంధించి వేరొక ఆస‌క్తిక‌ర అప్‌ డేట్ తెలిసింది. ఈ చిత్రంలో అఖిల్ పాత్ర‌లో ఓ ట్విస్ట్ ఉంటుంది. తాత ఏఎన్నార్ న‌టించిన బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ `ప్రేమ‌న‌గ‌ర్‌` పాత్ర స్ఫూర్తితో అఖిల్ పాత్ర‌ని తీర్చిదిద్దార‌ట‌. ఏఎన్నార్ అంత కూల్‌ గా - సెటిల్డ్‌ గా అఖిల్ క‌నిపిస్తాడ‌ట‌. ఇంకా టైటిల్ ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇప్ప‌టికి మిస్ట‌ర్ మ‌జ్ను అన్న వ‌ర్కింగ్ టైటిల్ వినిపిస్తోంది. డిసెంబ‌ర్‌ లో సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.
Tags:    

Similar News