కింగ్ అక్కినేని నాగార్జున కు దేశవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హీరోలందరూ పాన్ ఇండియా అంటున్నారు కానీ.. 1990స్ లోనే 'శివ' చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో విడుదల చేసి పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు నాగ్.
టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తూనే.. అవకాశం వచ్చినప్పుడల్లా నేరుగా హిందీ చిత్రాలలోనూ నటించారు. 'శివ' తో పాటుగా 'ఖుదాగవా' 'ద్రోహి' 'క్రిమినల్' 'అంగారే' 'జక్మ్' 'అగ్ని వర్ష' 'LOC కార్గిల్' వంటి హిందీ చిత్రాల్లో నాగార్జున నటించారు. అయితే 2003 తర్వాత బాలీవుడ్ కు దూరంగా ఉంటూ వచ్చారు.
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నాగ్ ఇప్పుడు ''బ్రహ్మాస్త్ర'' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇస్తున్నారు. మూడు భాగాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ఇది. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇందులో రణబీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటించగా.. బిగ్ బీ అమితాబ్ - నాగార్జున - మౌనీ రాయ్ కీలక పాత్రలు పోషించారు. నాగ్ ఈ సినిమాలో నంది అస్త్రాన్ని కలిగి ఉన్న అనిష్ శెట్టి గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ క్రమంలో బుధవారం 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ ను మేకర్స్ ఆవిష్కరించారు. నాగార్జున విజువల్ తో మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. అగ్ని హస్త్ర శివ కు రక్షకుడిగా.. అతీంద్రియ శక్తులు కలిగిన నంది అస్త్ర పాత్రలో కింగ్ కనిపించారు. ట్రైలర్ లో తక్కువ సీన్లలో కనిపించినా.. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టారు.
కథలో నాగార్జున పాత్ర చాలా కీలకమని అర్థం అవుతోంది. తన కెరీర్ లోనే తొలిసారిగా ఇలాంటి పాత్ర పోషించారు. సినిమాలో నిడివి ఎంత ఉంటుందనేది పక్కన పెడితే.. 'బ్రహ్మాస్త్ర' సినిమాలో నాగ్ రోల్ పట్ల అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. ఇది వారిని ఎంతో ఎగ్జైట్ చేసిందని తెలుస్తోంది. కచ్చితంగా తమ అభిమాన హీరోకి సాలిడ్ రీఎంట్రీ అవుతుందని భావిస్తున్నారు.
భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ని ''బ్రహ్మాస్త్రం: మొదటి భాగం శివ'' అనే పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తున్నారు.
నాగార్జున మరియు రాజమౌళి ఈ ప్రాజెక్ట్ లో భాగం అవ్వడంతో తెలుగులోనూ ''బ్రహ్మాస్త్రం'' సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 2022 సెప్టెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. స్టార్ స్టూడియోస్ - ధర్మ ప్రొడక్షన్స్ - ప్రైమ్ ఫోకస్ - స్టార్ లైట్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ నిర్మిస్తున్నాయి.
Full View