అక్కినేని ఫ్యామిలీ నుంచి కూడా ఇప్పుడు చాలామంది హీరోలు వచ్చేశారు. నాగార్జునతో స్టార్ట్ చేస్తే.. నాగ చైతన్య.. అఖిల్.. సుమంత్.. సుశాంత్.. ఇలా ఐదుగురు హీరోలు ఉన్నారు. నిజానికి నాగార్జునకు కొత్త డైరెక్టర్లను ప్రోత్సహించడం అంటే భలే ఇష్టం. శివ దగ్గర నుంచి స్టార్ట్ చేసి.. ఇప్పటివరకూ ఈ ట్రెండ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారాయన. అయితే.. రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీతో సినిమాలు తీస్తున్న డైరెక్టర్ల తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది.
ప్రస్తుతం నాగచైతన్యతో ప్రేమమ్ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు చందూ మొండేటి. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కూడా జరిగింది.. దసరాకి రిలీజ్ కూడా కన్ఫాం అయింది. అయినా సరే.. ఈ డైరెక్టర్ ఎక్కడా ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. కనీసం మీడియాతో కూడా మాట్లాడ్డం లేదు. సినిమా రిలీజ్ అయ్యే వరకూ మాట్లాడబోనన్నది ఈ డైరెక్టర్ మాట. ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన నాగ్ మూవీ సోగ్గాడే చిన్నినాయన చిత్రాన్ని తీసిన కళ్యాణ్ కృష్ణ కూడా ఇలాంటి యాటిట్యూడ్ నే చూపించాడు. మూవీ రిలీజ్ అయ్యి మంచి టాక్ వచ్చాకే మాట్లాడ్డం మొదలుపెట్టాడు.
వీళ్ల వెర్షన్ చూస్తుంటే.. సినిమా మాట్లాడాలి.. సినిమాలో కంటెంట్ మాట్లాడాలి తప్ప.. తాము ముందే గొప్పలు చెప్పకోకూడదని ఫిక్స్ అయ్యారనే సంగతి అర్ధమవుతోంది. మరి మిగతా డైరెక్టర్లు.. దీన్నుంచి నేర్చుకునేది ఏమైనా ఉందంటారా?