టాలీవుడ్ లో వారసులు చెలరేగిపోవడం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం తెలుగులో ఈ హీరోల సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి. అయితే.. అక్కినేని కుర్రాళ్లు మాత్రం కలిసికట్టుగా ఫెయిల్ అవుతున్నారు. నాగార్జున హిట్స్ తో చెలరేగిపోతున్నా.. తర్వాతి తరం అక్కినేని హీరోలు మాత్రం హిట్ కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది.
నాగ చైతన్య హిట్ కొట్టి చాలా కాలమే అయింది. క్రేజీ ప్రాజెక్టులు.. కాంబినేషన్లలోనే చేస్తున్నా.. సినిమాలు మాత్రం హిట్ అనిపించుకోవడం లేదు. ఇప్పుడు రాబోతున్న ప్రేమమ్ పై చైతు ఆశలు చాలానే ఉన్నాయి. ఇక అక్కినేని అఖిల్ సంగతి అయితే మరీ దారుణం. మొదటి సినిమానే భయంకరమైన డిజాస్టర్ కావడంతో.. కొత్త సినిమా స్టార్ట్ చేసేందుకు కూడా ఇంకా ధైర్యం చేయలేదు.
వీళ్లిద్దరే కాదు.. సుమంత్.. సుశాంత్ లాంటి హీరోల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. విక్కీ డోనర్ ని సుమంత్ రీమేక్ చేస్తుండగా.. ఆటాడుకుందాం రా అంటూ త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నాడు సుశాంత్. ఈ సినిమాలు హిట్ కావడం అక్కినేని కుర్రాళ్లకు చాలా ముఖ్యం. ఒకేసారి ఈ వంశంలోని హీరోలంతా ఫెయిల్యూర్స్ ఉండడానికి కారణం.. స్క్రిప్ట్ విషయంలో పక్కాగా లేకపోవడమే.
ఒకవైపు నాగ్ లాంటి సూపర్ జడ్జ్ పక్కున ఉన్నా.. ఇలా ఫెయిల్యూర్స్ ఎదుర్కోవడం ఆలోచించాల్సిన విషయమే.