సౌత్ టాప్ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్, ఆల్ రౌండర్ రాఘవ లారెన్స్ కి జాక్ పాట్ తగిలిందా? అంటే అవుననే తాజా సమాచారం. లారెన్స్ గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నా.. సడెన్ గా కిలాడీ అక్షయ్ ని డైరెక్ట్ చేస్తున్నాడంటూ వేడెక్కించే వార్త అందింది. హారర్ కామెడీల స్పెషలిస్టుగా పేరున్న లారెన్స్ తన ఫార్ములాని బాలీవుడ్ కి ఎగుమతి చేస్తున్నాడు. అక్కడ కిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా `కాంచన`, `ముని` చిత్రాల్ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆ మేరకు చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది.
అయితే ఇది రీమేక్ కాదు. కాంచన, ముని చిత్రాల్ని కలిపి తీసే ఓ హారర్ కామెడీ చిత్రమని మేకర్స్ చెబుతున్నారు. అంటే అక్షయ్ కుమార్ దెయ్యం పాత్రలో నటించబోతున్నారన్నది మాత్రం సుస్పష్టం. కాంచన కథలో హిజ్రా(శరత్ కుమార్) ఆత్మ లారెన్స్ లో ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ఎంతో ఉత్కంఠగా తెరకెక్కించడంలో లారెన్స్ పనితనానికి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. అందుకే అక్షయ్ సైతం ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తిని వ్యక్తం చేశారట. వాస్తవానికి దెయ్యాలు అంటే తనకు చాలా భయమని అక్కీ చెబుతుంటారు. సాయంత్రం సూర్యుడు అస్తమించాక ఇంట్లోంచి బయటకు వెళ్లనని అంటుంటాడు. అలాంటి హీరోని హారర్ సినిమాకి కమిట్ చేయించడంలోనూ లారెన్స్ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే.
ఇక ఈ చిత్రాన్ని 2020 లోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. తొలిగా ఆర్నెళ్ల పాటు స్క్రిప్టు వర్క్ చేస్తారట. అటుపై ఈ ఏడాది జూన్- జూలైలో సినిమాని ప్రారంభించి ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలన్నది ప్లాన్. కిలాడీ ఈ సినిమా కోసం ఏకంగా 60-70 రోజుల్లో సినిమాని పూర్తి చేస్తారట. దానికి అనుగుణంగా అక్కీ కాల్షీట్లు కేటాయించనున్నారని తెలుస్తోంది. రాఘవ లారెన్స్ ఇప్పటికే తెలుగు, తమిళంలో డజను పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ద్విభాషా చిత్రాల్ని తెరకెక్కించిన సమర్ధుడు. ఇక బాలీవుడ్ లోనూ ప్రభుదేవా తరహాలో పెద్ద సక్సెసవుతాడనే ఆశిద్దాం.
Full View