బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ పురస్కారానికి ఎంపికయ్యాడు. రుస్తోం చిత్రంలో అక్షయ్ ప్రదర్శించిన నటనకు గాను ఈ అవార్డ్ దక్కగా.. జ్యూరీ సభ్యులకు లంచాలు ఎరచూపి ఈ అవార్డు గెలుచుకున్నాడంటూ హంగామా జరుగుతోంది.
జాతీయ అవార్డు రావడం స్పందించిన అక్షయ్ కుమార్.. "దేశంలోని ఏ నటుడికైనా జాతీయ అవార్డు దక్కడం అంటే అది అత్యున్నత పురస్కారం కిందే లెక్క. అందరిలాగే నేను కూడా ఈ అవార్డు కోసం ఎంతో కష్టపడ్డాను. అసలు ఈ అవార్డును నాకు ప్రకటించారని తెలియగానే మొదట నమ్మలేకపోయాను" అన్న అక్షయ్.. లంచాల టాపిక్ పై కూడా రియాక్ట్ అయ్యాడు. "ఈ అవార్డ్ కే కాదు ఎప్పుడూ ఏ అవార్డ్ కోసం నేను ఏ రూపంలోను లంచం ఇవ్వలేదు. గతంలో ఓ సారి నేను డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేస్తే అవార్డ్ ఇస్తామనే ప్రతిపాదన కూడా తిరస్కరించాను" అని చెప్పాడు ఖిలాడి.
ఇక జాతీయ అవార్డుల ఎంపిక జ్యూరీ కమిటీ ఛైర్ పర్సన్ గా వ్యవహరించిన ప్రియదర్శన్.. అక్షయ్ కుమార్ కు అవార్డు రావడంపై అందరూ ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతున్నారో అర్ధం కావడం లేదని అన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/