రెబల్ ఫ్యాన్స్ నిరాశ పరుస్తున్న రాజా సాబ్..?

ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు.

Update: 2025-01-06 05:11 GMT

ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే ఈ సినిమా విషయంలో రెబల్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ గా ఉన్నారన్న టాక్ ఉంది. సోషల్ మీడియా ముఖ్యంగా ఎక్స్ వేదికగా రెబల్ ఫ్యాన్స్ డైరెక్ట్ గానే రాజా సాబ్ డైరెక్టర్ మారుతి, నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీద ట్రోల్స్ చేస్తున్నారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా రాజా సాబ్ అప్డేట్ కోసం ఎదురుచూస్తుంటే వాళ్లని మరింత వెయిటింగ్ లో పెడుతున్నారు మేకర్స్.

సెట్స్ మీద ఉన్న సినిమా గురించి స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటారు. అప్డేట్స్ తెలుసుకోవాలని ఉత్సాహపడుతుంటారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల వాళ్లు చాలా డిజప్పాయింట్ అవుతారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ఫ్యాన్స్ వంతు అదే అయ్యింది. రాజా సాబ్ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క మోషన్ పొస్టర్ ఇంకా ప్రభాస్ గ్లింప్స్ తప్ప మరోటి రాలేదు. ఐతే ఫ్యాన్స్ ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా సరే చిత్ర యూనిట్ నుంచి మినిమం రెస్పాన్స్ కూడా రావడం లేదు.

ఈమధ్య మారుతి ఒక సినిమా ఈవెంట్ లో పాల్గొన్నాడు. అక్కడ రాజా సాబ్ అప్డేట్ అడిగినా లేదు కాదన్న సమాధానమే వచ్చింది. ఈ విషయంపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా మారుతి వైపే తప్పు చూపిస్తున్నారు. స్టార్ ని హ్యాండిల్ చేయడం మారుతికి రాదని.. సినిమాను ఎంగేజ్ చేసేలా ప్రమోషనల్ అప్డేట్స్ ఇవ్వాలని అది ఆయనకు తెలియదని ఎక్స్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలా స్టార్ సినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది.

సినిమా మొదలైనప్పటి నుంచి రకరకాల ప్రమోషన్స్ తో అదరగొట్టేస్తారు. కానీ మారుతి రాజా సాబ్ విషయంలో ఫ్యాన్స్ ని పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. ఐతే ఈ వెయిటింగ్ కి డబుల్ కిక్ ఇచ్చేలా సినిమా ఉంటే పర్లేదు ఒకవేళ అంచనాలకు తగినట్టుగా లేకపోతే మాత్రం ఆటాడుకుంటారన్న విషయం గమనించాలి. రెబల్ ఫ్యాన్స్ విషయంలో మారుతి అండ్ టీం చాలా అశ్రద్ధగా ఉన్నారని కొందరు అంటున్నారు. మరి రాజా సాబ్ ఏం చేస్తున్నాడు.. షూటింగ్ అప్డేట్స్ ఏంటి.. టీజర్ రిలీజ్ ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News