బాలయ్య కెపాసిటీ పట్టేసినట్టు ఉన్నాడే..?
ఈ సినిమా విషయంలో బాలయ్య ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. బాలకృష్ణ మాస్ స్టామినాను డైరెక్టర్ బాబీ పర్ఫెక్ట్ గా పట్టేసినట్టు ఉన్నాడే అని అనుకుంటున్నారు.
స్టార్ హీరోతో సినిమా చేస్తున్నప్పుడు ఆ హీరో బలాబలాలు ఏంటన్నది తెలుసుకుని సినిమా చేస్తుంటారు. ముఖ్యంగా డైరెక్ట్ చేస్తున్న హీరో మాస్ స్టామినా మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ప్రస్తుతం సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో డాకు మహారాజ్ మీద ఫ్యాన్స్ లో సూపర్ ఎగ్జైట్మెంట్ మొదలైంది. ఈ సినిమా విషయంలో బాలయ్య ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. బాలకృష్ణ మాస్ స్టామినాను డైరెక్టర్ బాబీ పర్ఫెక్ట్ గా పట్టేసినట్టు ఉన్నాడే అని అనుకుంటున్నారు.
డాకు మహారాజ్ ట్రైలర్ తోనే హిట్ వైబ్ వచ్చేసింది. సినిమాలో బాలకృష్ణ మాస్ మేనియా నందమూరి ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. బాలయ్యతో సినిమా తీసే డైరెక్టర్ ఆయన్ను ఎంత మాస్ గా చూపిస్తే అంత సక్సెస్ అవుతారు. ఆల్రెడీ వరుస సూపర్ హిట్ సినిమాలతో సూపర్ ఫాం కొనసాగిస్తున్న బాలకృష్ణ ఈసారి డాకు మహారాజ్ తో డబుల్ ట్రీట్ ఇచ్చేలా ఉన్నాడు. బాలకృష్ణ మార్క్ మాస్ మూవీగా డాకు మహారాజ్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు డైరెక్టర్ బాబీ.
బాలకృష్ణ తో సినిమా అంటే ఆయన్ను ఎంత వాడుకుంటే అంత రిజల్ట్ అన్నట్టుగా ఉంటుంది. చాలా తక్కువమంది ఈ విషయాన్ని పసిగట్టేస్తారు. బాలయ్య లోని మాస్ యాంగిల్ ని పర్ఫెక్ట్ గా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఎగ్జిక్యూట్ చేస్తే రికార్డులు బద్ధలు అవుతాయి. రైటర్ గా కథ మీద పట్టు సాధించిన బాబీ పవర్ తో డైరెక్టర్ గా మారిన దగ్గర నుంచి క్రేజీ సినిమాలతో వస్తున్నాడు. ఇప్పుడు బాలయ్యతో డాకు మహారాజ్ అంటూ అదరగొట్టబోతున్నారు. బాబీ కూడా తాను రాసుకున్న కథను ఆడియన్స్ కి ఎంగేజ్ చేయడంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తాడు. డాకు మహారాజ్ విషయంలో కూడా అది రిపీట్ చేస్తాడని అనిపిస్తుంది.
డాకు మహారాజ్ ప్రమోషన్స్ తోనే సినిమా లెక్క ఏంటన్నది తెలిసేలా చేశాడు. డాకు మహారాజ్ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెల, ప్రగ్యా జైశ్వాల్ కథానాయికలుగా నటించారు. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుందని నందమూరి ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. బాలయ్య మార్క్ మాస్ ప్రాజెక్ట్ గా వస్తున్న డాకు మహారాజ్ మూవీ సంక్రాంతికి ఫ్యాన్స్ కి అసలైన మాస్ ఫీస్ట్ అందించాలని చూస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందిస్తుంది అన్నది చూడాలి.