సెలబ్రిటీల కొత్త ప్లాస్టిక్ ఛాలెంజ్ చూశారా

Update: 2018-06-05 09:36 GMT

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఛాలెంజ్ లో తో తారలు చాలా బిజీ అవుతున్నారు. హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్ ఛాలెంజ్ ను ప్రతి ఒక్కరు పాటిస్తూ వైరల్ అయ్యేలా చేస్తున్నారు. అభిమానుల్లో ఎంతో కొంత ఫిట్ నెస్ పై అవహగానా కలిగేలా వారికి వారే ఛాలెంజ్ లతో బిజీ అవుతున్నారు. ఇక ఇప్పుడు ఆ ఛాలెంజ్ కాకుండా మరో కొత్త తరహా ఛాలెంజ్ మొదలయ్యింది. మళ్లీ బాలీవుడ్ తారలే దానికి శ్రీకారం చుట్టారు.

యాక్టర్ దియా మీర్జా ప్రస్తుతం పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ దేశ పర్యావరణాన్ని ఏ స్థాయిలో నాశనం చేస్తుందో అనే అంశాన్ని వివరించి ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో భాగంగా ఇతర నటీనటులు కూడా బాగమయ్యారు. ప్లాస్టిక్ ను తగ్గించాలని ఇచ్చిన పిలుపుకు బాలీవుడ్ తారాగణం కూడా మెల్లగా కదులుతోంది.

హాట్ బ్యూటీ అలియా భట్ కూడా ప్లాస్టిక్ ని నిర్ములించాలని ఆది భూమిలో విలీనమయ్యేందుకు 450 ఏళ్లు పడుతుందని వివరిస్తూ.. స్టీల్ బాటిల్ ను వాడాలని తన చేతిలో ఉన్న దాన్ని సెల్ఫీ తీస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అలాగే అర్జున్ కపూర్ కూడా ఓ సెల్ఫీతో అభిమానానులను ఆకర్షించగా సీనియర్ హీరోయిన్ జూహీ చావ్లా తనదైన శైలిలో మెస్సేజ్ ఇచ్చింది. 
Tags:    

Similar News