మామూలుగా సినీ పరిశ్రమలో పెద్ద ఫ్యామిలీస్ నుంచి అమ్మాయిలు సినిమాల్లోకి రావడమే తక్కువ. ఒకవేళ వచ్చినా చాలా పద్ధతిగా కనిపించడానికే చూస్తారు. కానీ కాలం మారుతోంది కదా. ఈ అమ్మాయిలు కూడా మారిపోతున్నారు. హీరోలు, దర్శకుల కూతుళ్లు కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పట్లేదు. ఇప్పటికే అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ బికినీ అందాలతో మత్తెక్కించింది. ఇప్పడు మహేష్ భట్ కూతురు ఆలియా భట్ వంతు వచ్చింది. ‘షాన్ దార్’ సినిమా కోసం ఈ అమ్మాయి బికినీ వేసేసింది. ఇప్పటిదాకా కనిపించిన బికినీ భామలందరికీ సవాలు విసిరేలా బికినీలో అందాలు ఆరబోసింది ఆలియా.
ఐతే బికినీ వేయడానికి ముందు ఆలియా చాలానే కష్టపడిందట. బబ్లీగా ఉండే ఆలియా.. బికినీ వేయాలని చెప్పగానే కొన్ని నెలల పాటు జిమ్ముకెళ్లి ఒళ్లు కరిగించింది. ఆ కష్టానికి ఫలితం కూడా దక్కింది. బికినీలో కత్తిలా ఉందన్న కామెంట్లు వినిపించాయి. ఐతే ఆ తర్వాత మొదలైంది అసలు కష్టం. బికినీ కోసం సన్నబడ్డ సంగతి మర్చిపోయి ఆలియానందరూ ఓ పేషెంట్లా చూస్తున్నారట. ‘‘బికినీలో నా బాడీ బాగుండాలని సన్నబడ్డాను. కానీ అందరూ.. ఏంటిలా అయిపోయావ్? మరీ సన్నబడిపోయావ్? అని అడుగుతుంటే ఏదో తప్పు చేశానా అని బాధగా ఉంది. ఏదో పేషెంటుని పరామర్శించినట్లు పరామర్శిస్తున్నారు. అందరూ ఇలా అడుగుతుంటే మళ్లీ బరువు పెరగాలనిపిస్తోంది. ఇంకెప్పుడూ బరువు తగ్గకూడదు అనిపిస్తోంది’’ అని ఆలియా చెప్పింది.