మూడు రోజుల కోసం అన్ని సెట్లా?

Update: 2022-09-21 06:16 GMT
ఈ మ‌ధ్య ప్రేక్ష‌కులకు స‌రికొత్త అనుభూతిని క‌లిగించ‌డానికి మేక‌ర్స్ ఏం చేయ‌డానికైనా.. క‌థ‌ని ఎలివేట్ చేసేందుకు ఎంత ఖ‌ర్చు చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేదు. ప్రేక్ష‌కుడిని థియేట‌ర్ల‌కు ర‌ప్పించడానికి ఎంత చేయాలో అంత చేస్తున్నారు. స‌రికొత్త అనుభూతిని క‌లిగించ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందు కోసం కోట్ల ఖ‌ర్చు చేస్తున్నారు. రెండు మూడు రోజుల షూటింగ్ కోసం కూడా భారీ స్థాయిలో ఖ‌ర్చుకు వెన‌కాడ‌కుండా భారీ సెట్ ల‌ని నిర్మించిన ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

వివ‌రాల్లోకి వెళితే.. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా 'స‌లార్‌' కోసం ఇదే త‌ర‌హాలో భారీ సెట్ ల కోసం మేక‌ర్స్ హోంబ‌లే ఫిలింస్ ఖ‌ర్చు చేస్తుండ‌టం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 'కేజీఎఫ్‌' సిరీస్ సినిమాల‌తో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో భారీ స్పాన్ వున్న 'స‌లార్‌' మూవీని రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ గ‌త కొంత కాలంగా వివిధ కార‌ణాల‌తో ఆగుతూ సాగుతూ వెళుతోంది.

ఈ నేప‌థ్యంలో ఈ మూవీని ఇక‌పై రాకెట్ స్పీడుతో పూర్తి చేయాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నాడ‌ట‌. అయితే ఇటీవ‌లే ప్ర‌భాస్ పెద‌నాన్ని రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య కార‌ణాల వ‌ల్ల మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌భాస్ షూటింగ్ ల‌కు బ్రేక్ ప‌డింది. దీంతో 'స‌లార్‌' షూటింగ్ కూడా ఆగిపోయింది. ఇటీవ‌ల ఓ కీల‌క స‌న్నివేశం కోసం ప్ర‌భాస్ సెట్ లోకి వచ్చిన‌ట్టుగా చెబుతున్నారు. ఇదిలా వుంటే ప్ర‌భాస్ పాల్గొన‌గా ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ కోసం ఏకంగా 12 సెట్ లు సిద్ధం చేశార‌ట‌.

రామోజీ ఫిల్మ్ సిటీలో ప్ర‌త్యేకంగా భారీ స్థాయిలో ఈ సెట్ ల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ వేయించిన‌ట్టుగా తెలుస్తోంది. భారీ సెట్ ల‌లో కేవ‌లం రెండు, మూడు రోజులు మాత్ర‌మే షూటింగ్ ..కానీ 12 సెట్ లు ఖ‌చ్చితంగా అవ‌సరం కావ‌డంతో ఎంత ఖ‌ర్చు అయినా వేయించ‌క త‌ప్ప‌లేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ సెట్ లు ప్ర‌భాస్ కోసం ఎదురుచూస్తున్నాయ‌ట‌. ప్ర‌తీ సెట్ లో రెండు నుంచి మూడు రోజులు మాత్ర‌మే షూటింగ్ వుంటుంద‌ని చెబుతున్నారు.

'కేజీఎఫ్ 2' ఊహించ‌ని విధంగా హ్యూజ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచి వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 1250 కోట్లు వ‌సూళు చేయ‌డంతో ప్ర‌శాంత్ నీల్ 'స‌లార్‌' విష‌యంలో ప్ర‌తీ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకుంటున్నార‌ట‌. ఖ‌ర్చు విష‌యంలోనూ మేక‌ర్స్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డంలేద‌ని 12 సెట్ ల విష‌యం స్ప‌ష్టం చేస్తోందని ఇండస్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News