టైం బాగా లేకపోతే అంతే ఒక్కోసారి పెద్ద హీరోలకు సైతం అగ్ని పరీక్ష పెడుతుంది. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఎబిసి అనే సంస్థ స్థాపించి అప్పుల పాలయ్యాక ఆయన ఇక ఏమైపోతారో అని భయపడుతున్న సమయంలో వచ్చిన కౌన్ బనేగా కరోడ్ పతి ఆయన జీవితాన్నే కాదు రియాలిటీ షోలలో ఒక కొత్త శకాన్ని ప్రారంభించింది. అది మొదలు ఈ పదిహేనేళ్ళలో ఆయనకు మళ్ళి వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. 1995 మొత్తం చిరంజీవి ఒక్క సినిమా కూడా చేయకపోవడానికి కారణం వరస పరాజయాలే. ఆ తర్వాత హిట్లర్ తో సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో కొందరు హీరోలకు అలాంటి బ్యాడ్ పీరియడ్ రన్ అవుతుంది. ఏది ముట్టుకున్నా ఇత్తడి అవుతున్న తరహాలో ఎవరితో సినిమా చేసినా డిజాస్టర్ కు తక్కువ ఫలితం దక్కడం లేదు.
వాళ్ళే అల్లరి నరేష్ - సునీల్. ఒకప్పుడు కామెడీ సినిమా చూడాలంటే అల్లరి నరేష్ మాత్రమే ఛాయస్ గా ఉండేవాడు. ఇప్పటికి నరేష్ చేసిన సినిమాలు టీవీలో వస్తే చూసే ప్రేక్షకులు చాలానే ఉన్నారు. అలాంటి నరేష్ గత నాలుగేళ్ళుగా హిట్ లేక సతమతమవుతున్నాడు. సీరియస్ జానర్ లోకి వెళ్లి బందిపోటు చేసినా, లవ్ స్టొరీ గా మేడ మీద అబ్బాయి చేసినా, హారర్ ట్రై చేద్దామని ఇంట్లో దెయ్యం నాకేం భయం చేసినా ఏది హిట్ కాలేదు. ఇక సునీల్ పరిస్థితి సరేసరి. 2 కంట్రీస్ మొదటి ఆటకు సగం హాల్ నిండెంత ఓపెనింగ్ కూడా రాలేదు. ఈ ఇద్దరు ఇప్పుడు ఒక సినిమా కోసం జట్టు కడుతున్నారు.
విడుదలకు సిద్ధంగా ఉన్న ఆచారి అమెరికా యాత్ర దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తమిళ్ హిట్ మూవీ తమిజ్ పాదం 2.0 కు రీమేక్ గా ఇది రూపొందనుంది. నిన్న ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటుందట. భీమినేని శ్రీనివాసరావు నిర్మిస్తున్న ఈ మూవీలో నందిని రాయ్ ఒక హీరొయిన్ గా సెలెక్ట్ అయ్యింది. మరి ఇదైనా ఈ ఇద్దరికీ జాయింట్ హిట్ ఇస్తే కామెడీ శకం మళ్ళి మొదలయినట్టే. ఇది సుడిగాడు సీక్వెల్ తరహాలో ఉంటుందని టాక్.