మహర్షి చేతుల్లో అతని భవిష్యత్తు ?

Update: 2019-04-18 07:18 GMT
వచ్చే నెల 9న రిలీజ్ కు రెడీ అవుతున్న మహర్షి మీద మెల్లగా అంచనాలు ఎగబాకుతున్నాయి. మహేష్ అనే పేరు హైప్ వచ్చేందుకు చాలు. అలాంటిది ఇందులో చాలా అదనపు ఆకర్షణలు తోడవడంతో బిజినెస్ పరంగా కూడా చాలా క్రేజ్ వచ్చింది. టీజర్ లో మహేష్ పాత్ర తాలూకు తీరుతెన్నులు లైట్ గా చూపించిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఇదంతా వట్టి శాంపిలే అంటున్నాడు.

ఇదిలా ఉండగా ప్రేక్షకులు అల్లరి నరేష్ పాత్ర మీద కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ స్థానాన్ని భర్తీ చేసే రేంజ్ లో వేగంగా యాభై సినిమాలు పూర్తి చేసిన అల్లరి నరేష్ ఆ తర్వాత వరస పరాజయాలతో బాగా వెనుకబడిపోయాడు. మినిమమ్ గ్యారెంటీ రేంజ్ నుంచి కనీస ఓపెనింగ్స్ దక్కించుకోలేని స్థాయికి పడిపోయాడు.

ఇప్పుడు మహర్షిలో చేస్తోంది ఖచ్చితంగా హీరో సమానమైన రోల్ అయితే కాదు. ఫ్రెండ్ గా కీలకమైనదే అనిపిస్తున్నప్పటికి మహేష్ అంత స్పాన్ అయితే ఉండకపోవచ్చు మహర్షి ఒకవేళ ఆశించినట్టుగా సక్సెస్ అయితే అందులో అల్లరి నరేష్ కు ఎంత క్రెడిట్ దక్కుతుంది అనే దాని మీద ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. హీరోగా ఇప్పటికీ ఒకరిద్దరు నిర్మాతలు సినిమాలు తీస్తున్నప్పటికీ మునుపటి డిమాండ్ మార్కెట్ అయితే లేదు. సో పికప్ కావాలి అంటే మహర్షి హిట్ కావడం చాలా అవసరం.

అదే జరిగినా అల్లరి నరేష్ తరువాత ఇలాంటి పాత్రలే ఆఫర్ చేస్తారా లేక సోలో హీరోగా మళ్ళి కామెడీ చిత్రాలను తీసేందుకు ముందుకు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎంత హాస్య చిత్రాలు చేసినా అల్లరి నరేష్ కూ ఫాలోయింగ్ ఉంది. తమ హీరో మునుపటి లాగా వరసగా సినిమాలు చేయాలని అతని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి మహర్షి అతని భవిష్యత్తుని నిర్దేశించే దిక్సూచి అవుతుందో లేదో చూడాలి


Tags:    

Similar News