నట కిరీటి రాజేంద్రప్రసాద్ తర్వాత అంతలా తెలుగువారిని మెప్పించిన కామెడీ హీరో అల్లరి నరేష్. అయితే ఈ మధ్య అల్లరోడి పరిస్థితి ఏమంత బాగోలేదు. కొంతకాలంగా సరైన హిట్టు లేక సతమవుతున్నాడు నరేష్. అలాగే బ్రహ్మానందం తర్వాత ఆ రేంజ్ లో అలరించిన కమెడియన్ సునీల్. అయితే హాస్య నటుడి నుంచి హీరోగా మారిన సునీల్ ది కూడా సేమ్ టు సేమ్ పరిస్థితి. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సక్సెస్ మాత్రం రావట్లేదు.
అందుకే విజయలక్ష్మి కోసం ఇద్దరు చేతులు కలవబోతున్నారట. కామెడీ హీరోలు కలిసి ఓ సినిమా చేయబోతున్నారట. అయితే ఇది మల్టీస్టారర్ అనుకుంటే పొరపాటే. ఈవీవీ గారబ్బాయి నిర్మాతగా... సునీల్ హీరోగా తెరకెక్కనుందీ సినిమా. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ స్థాపించిన ఈవీవీ బ్యానర్ నుంచే ఈ సినిమా వెలువడనుంది. తండ్రి మరణం తర్వాత ఈవీవీ బ్యానర్ కొనసాగుతుందని... తన సినిమాలతో పాటు ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తామని చెప్పాడు నరేష్. అయితే ఈవీవీ సత్యనారాయణ మరణం తర్వాత ఒక్క ‘బందిపోటు’ సినిమా మాత్రమే ఈవీవీ బ్యానర్ నుంచి వచ్చింది. అందుకే సునీల్ హీరోగా నిర్మించే సినిమాతో ప్రారంభించి...ఇకపై ఈవీవీ బ్యానర్ నుంచి వరుస సినిమాలు రావాలని భావిస్తున్నారు ఈవీవీ బ్రదర్స్.
అయితే సునీల్ - నరేష్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ కూడా తెరకెక్కుతోంది. అల్లరోడితో ‘సుడిగాడు’ వంటి సూపర్ హిట్ తీసిన భీమినేని శ్రీనివాస రావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ‘సుడిగాడు’ ఒరిజినల్ తమిళం చిత్రం స్వీకెల్ గా ‘తమిజ్ పాదం 2.0’ రూపొందుతోంది. దీని ఆధారంగా ‘సుడిగాడు 2.0’ గా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.