కామెంట్: వాళ్లపై బన్నీ స్పెషల్ కేర్

Update: 2016-09-01 07:30 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో ప్రతీ అద్భుతంగా కనిపించడమే కాదు.. సినిమా సినిమాకి చాలా వేరియేషన్ కూడా ఉంటుంది. బన్నీతో సహా ప్రతీ ఒక్కరినీ డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తూ ఉంటారు సినిమాటోగ్రాఫర్లు. ఈ మధ్య ఈ తేడా బాగా కనిపిస్తోంది. ఇందుకు కారణం.. బన్నీ ఒక్కో మూవీకి ఒక్కో కెమేరామ్యాన్ ను దించుతూ ఉండడమే.

రేసుగుర్రం మూవీ కోసం మనోజ్ పరమహంస అనే సినిమాటోగ్రాఫర్ తో చేసిన బన్నీ.. ఆ తర్వాత సరైనోడు చిత్రం కోసం రిషి పంజాబీని పట్టుకొచ్చాడు. ఇతగాడి రెమ్యూనరేషన్ రోజుకు లక్ష పైగానే ఉంటుంది. బన్నీ కోరికల కారణంగా తనకు బడ్జెట్ పెరిగిపోతోందని.. అయితే కొడుకు కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఖర్చు చేస్తాం చెప్పండి అంటూ సరైనోడు ఫంక్షన్ లో ఓపన్ గా చెప్పాడు అల్లు అరవింద్. రిషి పంజాబి కోసం దాదాపు కోటికి దగ్గరలోనే చెల్లించారని టాక్. ఇప్పుడు డీజే.. దువ్వాడ జగన్నాధం వంతు వచ్చింది.

డీజే కోసం అయానంక బోస్ పేరు  కనిపిస్తోంది. బాలీవుడ్ లో భారీ చిత్రాలకు కెమేరా వర్క్ చేసే ఈ బోస్ కోసం.. దిల్ రాజు కోటికి పైగానే ముట్ట చెప్పాల్సి వస్తుందని అంటున్నారు. అయినా సరే ప్రతీ ఫ్రేమ్ ని ప్రత్యేకంగా చూపించే టెక్నీషియన్స్ విషయంలో బన్నీ ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదుగా!
Tags:    

Similar News