అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా నిన్న రాత్రి 'వరుడు కావలెను' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై అల్లు అర్జున్ తనదైన స్టైల్లోనే సందడి చేశారు. ఆయన మాట్లాడుతూ .. "దిగు దిగు దిగు నాగ .. నాగన్న దివ్యా సుందర నాగో నాగన్న" అనే ఈ సాంగ్ మా ఇంట్లో ప్రతి రోజూ ప్లే అవుతూనే ఉంటుంది. ఒక రోజున షూటింగు తరువాత నేను ఇంటికి వచ్చాను. నా కూతురు వచ్చిన నాన్న 'దిగు దిగు పెట్టు .. దిగు దిగు పెట్టు' అంటోంది. నాకు అర్థంకాక ఏంటని అడిగితే ఈ సాంగ్ అంటా. పిల్లలకు ఈ సాంగ్ మామూలుగా పట్టుకోలేదు. ఈ సాంగ్ తమన్ చేశాడని తెలిసింది.
హీరో నాగశౌర్య .. నిర్మాత నాగవంశీ .. ఎవరిపేరుమీద ఈ పాట జరిగిందా అనుకున్నాను. ఏదేమైనప్పటికీ కూడా స్కీమ్ అయితే బాగుంది .. పాట అయితే అదిరిపోయింది. నేను నాగశౌర్య సినిమాలు చాలా చూశాను. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూశానని చెప్పొచ్చు. చాలా అందగాడు .. తనలో ఏదో ఒక స్వీట్ నెస్ .. ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నా అందులో ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆయనలోని ఆ ఇన్నోసెన్స్ నాకు బాగా నచ్చుతుంది. తను డెఫినెట్ గా చాలా పెద్ద హీరో అవుతాడు. అంతమంచి మనసున్న వ్యక్తి పెద్ద హీరో కావాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను.
ఇందాక ఆయన నాకు తెలియని చాలా విషయాలు చెప్పాడు .. చాలా బాగా మాట్లాడాడు .. వెరీ వెరీ వెరీ నైస్. బేసికల్ గా నాకు సెల్ఫ్ మేడ్ పీపుల్ అంటే చాలా ఇష్టం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నాడు. అందుకు నేను ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నాను. రీతూ వర్మ విషయానికి వస్తే, తన ఫస్టు సినిమా నుంచి తనంటే నాకు ఇష్టం. ఫస్టు సినిమా చూసి నేను కాల్ చేసి కనుక్కున్నాను. ఈ అమ్మాయి ఎవరంటే, మన హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ఒక తెలుగు అమ్మాయి అని చెప్పారు. తెలుగు అమ్మాయి అనగానే నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది.
నాకు అమ్మాయిల్లో డిగ్నిటీ అంటే చాలా ఇష్టం .. తనలోని ఆ డిగ్నిటీ నాకు నచ్చుతుంది. ఆ అమ్మాయి ఏం చేసినా ఒక డిగ్నిటీ ఉంటుంది. ఆమెలోని ఆ డిగ్నిటీని నేను ఇష్టపడుతూ ఉంటాను. ఈ సినిమాలో ఆమె చాలా బాగుంది. డైరెక్టర్ లక్ష్మీ గురించి చెప్పాలి .. హీరోయిన్స్ గా మాత్రమే కాదు సినిమాల్లోని ఇతర విభాగాల్లోకి కూడా అమ్మాయిలు రావాలి. ముంబైలో షూటింగ్ చేసేటప్పుడు నేను గమనించాను. అక్కడ 50 శాతం మంది అమ్మాయిలే ఉంటారు. మన దగ్గర కూడా అలాంటి రోజులు రావాలని అనుకుంటూ ఉంటాను. లక్ష్మిని చూస్తుంటే ఆ రోజులు వచ్చాయనే అనిపిస్తోంది.
మ్యూజిక్ కి సంబంధించి విశాల్ పేరు చెప్పగానే ఫస్టు క్లాప్ కొట్టింది తమన్ .. అది నాకు చాలా నచ్చింది. చిన్న విషయంగానే కనిపించినా, ఆయన సంస్కారం నాకు నచ్చింది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు చాలా ఈగో క్లాషెస్ ఉంటాయి .. అలాటివి లేకుండా మన అనుకుని చేసినందుకు వాళ్లను నేను అభినందిస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన వారిని చూస్తుంటే .. ఇదేదో 'అల వైకుంఠపురములో' సినిమాకి కొనసాగింపుగా అనిపిస్తోంది. అందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను" అన్నారు.