దువ్వాడలో బన్నీ లుక్ లీక్ అయిపోయింది

Update: 2017-02-17 04:40 GMT
డీజే- దువ్వాడ జగన్నాధం అంటూ అల్లు అర్జున్ తో దర్శకుడు హరీష్ శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే చాలా అంచనాలు ఉండగా.. వాటితో పాటు ఈ స్టోరీ పైనా.. బన్నీ గెటప్స్ పైనా కొన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. డీజేలో బన్నీ ఒక బ్రాహ్మణుడి పాత్ర పోషిస్తాడని.. అదుర్స్ చారి టైపులో ఈ కేరక్టర్ ఉంటుందనే టాక్ ఉంది.

రీసెంట్ రిలీజ్ చేసిన ప్రీ లుక్ లో నామాలు చూపించడంతో ఇదే ఖాయం అనుకున్నారంతా. ఫస్ట్ లుక్ ను రేపు రిలీజ్ చేయనుండగా.. ఇప్పుడు ఇంటర్నెట్ లో ఓ లీక్డ్ పిక్చర్ హంగామా చేస్తోంది. ఈ ఫోటో ప్రకారం డీజేలో బన్నీ చేస్తున్న రోల్.. బ్రాహ్మణుడి రోల్ అనే విషయం తెలిసిపోయినట్లే. పిలక పెట్టినట్లుగా దువ్విన జుట్టు.. ఒళ్లంతా విబూధి నామాలు.. పంచె కుట్టు.. కాషాయ వస్త్రం.. మెడలో యజ్ఞోపవీతం.. అబ్బో బన్నీ లుక్ అదిరిపోయిందంతే.

లీక్డ్ ఫోటో అయినా.. నెట్ లో ఇప్పుడు బన్నీ కొత్త లుక్ వైరల్ అయిపోయింది. మొదటిసారిగా అల్లు అర్జున్ ఇలాంటి గెటప్ వేయడం హైలైట్ కాగా.. ఈ పాత్రతో నవ్వులు అల్లు అర్జున్ ఎన్నెన్ని నవ్వులు పూయించనున్నాడనే అంశంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. మొత్తానికి నెలల తరబడి తన లుక్ లీక్ కాకుండా జాగ్రత్త పడ్డాడు అల్లు అర్జున్. కానీ సరిగ్గా ఫస్ట్ లుక్ రిలీజ్ ముందు రోజున లీక్ అయిపోవడం.. ఆశ్చర్యమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News