తమ్ముడి డైరెక్టర్ తో బన్నీ సినిమా

Update: 2018-02-09 04:18 GMT
యంగ్ హీరో నిఖిల్ తో తీసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో ఇండస్ర్టీ దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ వి.ఐ.ఆనంద్. కాన్సెప్ట్ పాతదే అయినా తన ట్రీట్ మెంట్ తో కథనానికి కొత్తదనం తీసుకొచ్చాడు. దాంతో మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఒకేలా ఉండే ఇద్దరి జీవితాలు (పార్లల్ లైఫ్) అనే కాన్సెప్ట్ తో తెలుగులో తొలిసారి ప్రయోగాత్మకంగా ఒక్కక్షణం సినిమా తీశాడు.

ఒక్క క్షణం సినిమా బాక్సాఫీసును పెద్గగా ఆకట్టుకోలేక పోయింది. కాకపోతే ఇంతవరకు ఎవరికీ పరిచయం లేని కథాంశంతో కథ అల్లుకున్న వి.ఐ. ఆనంద్ ప్రతిభకు మంచి గుర్తింపే వచ్చింది. అతడితో కలిసి సినిమా చేయడానికి స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ గా వి.ఐ.ఆనంద్ బన్నీని కలిసి ఓ కాన్సెప్ట్ వివరించాడట.  అతి బాగా నచ్చడంతో దానిపై స్ర్కిప్ట్ సిద్ధం చేసే సినిమా చేసేందుకు అంగీకారం తెలిపాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వి.ఐ.ఆనంద్ తాను అనుకున్న లైనును డెవలప్ చేసి స్ర్కిప్ట్ సిద్ధం చేసే పనిలో పడ్డాడు.  

కెరీర్ లో డిఫరెంట్ సినిమాలు చేయాలని అల్లు అర్జున్ మొదటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈమధ్య వరసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ ఉండటంతో వి.ఐ.ఆనంద్ డైరెక్షన్ లో వచ్చే సినిమా తన నటనలోని మరో కోణాన్ని వెలికి తీస్తుందనే నమ్మకంలో బన్నీ ఉన్నాడని అతడి సన్నిహితులు చెబుతున్నారు. తమ్ముడి సినిమా హిట్ అవకపోయినా డైరెక్టర్ టాలెంట్ పై నమ్మకంతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడని అంటున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ రైటర్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సమ్మర్ కు థియేటర్లకు రానుంది.
Tags:    

Similar News