నా పేరు సూర్య.. ఏం చెప్పడట

Update: 2017-12-27 06:51 GMT
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల తరువాత ఒక డిఫెరెంట్ సినిమాతో రాబోతున్నాడు. నా పేరు సూర్య అనే సినిమా ఎప్పుడు చూడని విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పాత్ర సినిమాకు మరో ప్రాణమని ఆర్మీ అధికారిగా అతను మెప్పించడం గ్యారెంటీ అని అంటున్నారు. అల్లు అర్జున్ రేసు గుర్రం సినిమాకు కథను అందించిన వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

వంశీ మొదటి సినిమా కావడంతో ఎలా తెరకెక్కిస్తాడా అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అయితే సినిమా స్టార్ట్ అయ్యి నెలలు కావొస్తున్నా ఇంకా సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేదు. మొత్తానికి న్యూ ఇయర్ కానుకగా సినిమా ఫస్ట్ ఇంపాక్ట్ అని కొత్తగా ఎదో చూపించబోతున్నారు. రీసెంట్ గా ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. అందులో డైలాగ్స్ ఏమి ఉండవని తెలుస్తోంది. కేవలం అల్లు అర్జున్  లుక్ స్పెషల్ గా కనిపించనుందని సమాచారం. ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. ఒక్క మాట కూడా పలకకుండా ఇంప్రెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు బన్నీ.

ఈ టీజర్ తో  సినిమాపై అంచనాలు కూడా చాలా వరకు పెరుగుతాయని చెబుతున్నారు. మరి ప్రేక్షకులను అల్లు అర్జున్ ఎంతవరకు మెప్పిస్తాడు అనేది టీజర్ రిలీజ్ తరువాత తెలుస్తుంది. ఇక విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. అర్జున్ - శరత్ కుమార్ వంటి స్టార్ నటులు కూడా ప్రత్యేక పాత్రల్లో అలరించనున్నారు. లగడపాటి శ్రీధర్ - నాగేంద్ర బాబు సినిమాను నిర్మిస్తున్నారు.



Tags:    

Similar News