తెలుగు ఇండస్ట్రీలోని గొప్ప హాస్యనటులలో ఒకరు అల్లు రామలింగయ్య. దాదాపు పన్నెండు వందల సినిమాలలో నటించిన ఘనత ఆయనది. సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే పుట్టుకొస్తున్న రొటీన్ కామెడీని తన మార్క్ హాస్యం పండిస్తూ ఆయన బాటలోకి తీసుకెళ్లారు. ఇండస్ట్రీలోకి ఎందరో గొప్ప నటులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఎప్పటికి కొందరే గుర్తుంటారు. వారిలో అల్లు రామలింగయ్య ప్రథమంగా ఉంటారు అనడంలో సందేహం లేదు. నేడు ఆయన వర్థంతి. 1929 అక్టోబర్ 1వ తేదీన పాలకొల్లులో జన్మించిన అల్లు రామలింగయ్య జులై 31, 2004లో పరమపదించారు.
ఎన్నో వందల క్యారెక్టర్లు, మరెన్నో వేరియేషన్స్ చూపించిన ఆయనను తెలుగు ప్రేక్షకులు ఇంకా గుర్తుంచుకుని తలుచుకుంటున్నారు అంటే ఆయన సినిమాల ప్రభావమే అని చెప్పాలి. ఈరోజు సోషల్ మీడియా అంతా రామలింగయ్య గారి పోస్టులతో నిండిపోయింది. నిజానికి ఈ తరం వారికి అల్లు రామలింగయ్య పరిచయం లేకపోవచ్చు. కానీ ముందు తరాల వారికి మాత్రం అల్లు రామలింగయ్య అంటే ఓ సంపూర్ణ నటుడు. ఆయన జీవితంలో ఇప్పటికి ఎన్నో క్యారెక్టర్లు పోషించారు. ఒక కమెడియన్.. విలన్.. పంతులు.. సెంటిమెంట్ సీన్స్ ఇలా ఆయన చేయని జోనర్ లేదు. చిన్నప్పుడు నుండి నాటకాల ప్రదర్శన చేసి సినిమాలలోకి ప్రవేశించారు. తెలుగు 'పుట్టిల్లు’ సినిమాతో నటన రంగంలోకి అడుగుపెట్టి తనదైన హాస్యంతో, కామెడీ విలనిజంతో మెప్పించారు రామలింగయ్య.
ఇక సినీ రంగంలో ఆయన అందించిన సేవలకుగాను 1990లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్నారు. ఈ సందర్బంగా హీరో అల్లు అర్జున్ తన తాతయ్య గురించి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసాడు. ‘ఈరోజు తాతయ్య మమ్మల్ని వదిలివెళ్లిపోయారు. ఆయన గురించి ఆరోజు కంటే ఇప్పుడు చాలా తెలుసుకున్నాను. నాకు అనుభవం వచ్చేకొద్దీ ఆయన పడ్డ కష్టాలు.. కృషి.. పట్టుదల, ప్రయాణం ఏంటన్నది అర్థమైంది. ఓ పేద రైతు కుటుంబానికి చెందిన వ్యక్తికి సినిమాలపై ఉన్న మక్కువతోనే మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటూ’ అల్లు అర్జున్ భావోద్వేగ పూరిత ట్వీట్ చేశాడు. 73 ఏళ్ళ వయసులో 2004 జూలై 31వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం సోషల్ మీడియా అంత అల్లు రామలింగయ్యను స్మరిస్తున్నారు.