ఈరోజు పొద్దున్నే ''సరైనోడు'' సినిమాను సెన్సార్ ఎగ్జామినేషన్ కు పంపిస్తున్నట్లు అఫీషియల్‌గా తెలిసిపోయింది. ఇంకా రిలీజ్ చేయడానికి 15 రోజులు టైమ్ ఉండగా.. అప్పుడే సినిమాను సాధారణంగా ఇంకొక నిర్మాతలైతే సెన్సార్ కు పంపరు. కాని బన్నీ మాత్రం.. ఇది తమ సొంత సినిమా కాబట్టి.. 22న రిలీజ్ చేయడానికి ఎలాంటి అడ్డంకులూ ఉండకూడదని అప్పుడు సెన్సార్ స్లాట్ కూడా బుక్ చేసేశారు.
ఆద్యంత యాక్షన్ ఎలిమెంట్స్ తో ఎంతో ఆసక్తికరంగా సాగిన సరైనోడు సినిమా నిడివి.. దాదాపు 160 నిమిషాలు ఉందట. అంటే 2 గంటల 40 నిమిషాలు. ఇకపోతే సినిమాకు కట్స్ ఏమీ చెప్పకుండా యు/ఎ ఇచ్చారని కొందరు చెబుతుంటే.. కొన్ని ఫైటింగ్ సీన్లకు.. ఓ రెండు డైలాగ్ మ్యూట్లు.. మొత్తంగా కలుపుకుని ఒక 5 కట్స్ తో యు/ఎ ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఏదేమైనా అప్పుడే సెన్సార్ అయిపోవడం.. యు/ఎ చేతిలో పెట్టి పంపించడం.. సూపరంటే సూపరంతే.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ''సరైనోడు'' సినిమా.. ఏప్రియల్ 22న రిలీజ్ కానుంది.