ఈ రికార్డులేంది బన్నీ

Update: 2018-03-21 04:51 GMT
ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి సరైనోడు విడుదల సమయంలో వచ్చిన రివ్యూస్ ని పబ్లిక్ రెస్పాన్స్ ని కనక గుర్తుకు తెచ్చుకుంటే యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు అన్నది నిజం. అది మొదటి రెండు మూడు రోజుల మాట. ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. దర్శకుడు బోయపాటి శీను తనకు మాస్ పల్స్ మీద ఎంత పట్టు ఉందో కలెక్షన్ రూపంలో ఋజువు చేసి చూపించాడు. అఫ్ కోర్స్ బన్నీ ఊర మాస్ అవతారం కూడా దీనికి బాగా దోహద పడింది. సరే మన తెలుగు హీరో కాబట్టి ఇలాంటి రికార్డులు సహజం అనుకోవచ్చు. కాని బన్నీ సినిమాలు ఇక్కడ కంటే హింది - మలయాళంలో రికార్డులు సృష్టించడం ఎప్పుడూ ఆసక్తి రేపేదే. సరైనోడు హింది వెర్షన్ తాజాగా మరో అరుదైన రికార్డు తన సొంతం చేసుకుంది. ఇప్పటి దాకా యు ట్యూబ్ లో ఏ భారతీయ సినిమాకు దక్కని ఘనతను తన సొంతం చేసుకుంది.

ఇప్పటి దాకా ఈ సినిమాకు 145 మిలియన్ వ్యూస్ దక్కాయి. అంటే 14 కోట్ల 50 లక్షలకు పైగా ఈ వీడియో లింక్ ని ఓపెన్ చేసారన్న మాట. అంతే కాదు 5 లక్షల లైక్స్ దక్కించుకున్న తొలి ఇండియన్ మూవీగా కూడా సరైనోడు కొత్త ట్రెండ్ సెట్ చేసింది. అరగంట పాటు కత్తిరించి పాటలు లేకుండా వదిలిన ఒక డబ్బింగ్ వెర్షన్ కు ఇంత ఆదరణ దక్కడం అంటే మాటలు కాదు.అదేంటి చరిత్ర సృష్టించిన ఎన్నో హింది సినిమాలు ఉండగా దీనికి మాత్రమే ఎందుకు లైక్స్ వస్తాయి అనే అనుమానం కలగొచ్చు. హింది సినిమా చరిత్రలో గొప్ప సినిమాలుగా చెప్పుకునే షోలే - దిల్వాలే దుల్హనియా లేజాయేంగే - హం ఆప్  హై కౌన్ - మొగల్ ఎ ఆజాం లాంటివి యు ట్యూబ్ లో అధికారికంగా ఉచితంగా చూసే వెసులుబాటు లేదు. అందుకే సరైనోడు లాంటి మాస్ సినిమాలకు ఇంత ఆదరణ దక్కుతోంది. అన్నట్టు బన్నీ రికార్డుల వేట దీనితోనే ఆగడం లేదు.  డిజే కూడా 124 మిలయన్ వ్యూస్ తో తక్కువ టైం సరైనోడుని క్రాస్ చేసేందుకు ఉరకలు వేస్తోంది.

మొత్తానికి రెండు వంద మిలియన్ వ్యూస్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ ట్రాక్ రికార్డు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ సినిమాలు అప్  లోడ్ చేస్తున్న గోల్డ్ మైన్స్ అనే ఛానల్ పేరుకు తగ్గట్టు సౌత్ సినిమాల డబ్బింగ్ లతోనే భారీ ఆదాయాన్ని మూటగట్టుకుంటోంది. రాబోయే నా పేరు సూర్య మీద ఇంతకు మించి క్రేజ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాలా.
Tags:    

Similar News