బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు విడుదలకు ఇంకా గంటల వ్యవధి మాత్రమే ఉంది. ఇలాంటి సమయంలో బన్నీ ఇఫ్పుడు బెంగళూర్ లో దర్శనమిచ్చాడు. కన్నడ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన స్టైలిష్ స్టార్ ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి.. కన్నడలో కూడా కొన్ని మాటలు మాట్లాడేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
'ఏవైనా మంచి స్క్రిప్ట్స్ నా దగ్గరకు వస్తే.. రాజ్ కుమార్ కుటుంబంతో కలిసి కన్నడలో స్ట్రైట్ సినిమా చేయాలని అనుకుంటున్నా' అని చెప్పి.. కర్నాటక అభిమానులను ఖుషీ చేసేశాడు సరైనోడు. ఈ రాష్ట్రంలో కూడా బన్నీ సినిమాలకు బోలెడంత డిమాండ్ ఉంటుంది. అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి ఇక్క 5.80 కోట్లు, రేసుగుర్రం 5.20 కోట్ల రూపాయలను వసూలు చేశాయి. ఇప్పుడు సరైనోడుపై అంచనాలు ఎక్కువగా ఉండడంతో.. ఈసారి కర్నాటకలో హక్కుల కోసమే 9 కోట్లను చెల్లించారు డిస్ట్రిబ్యూటర్లు. అందుకే ఇక్కడ స్పెషల్ ప్రమోషన్స్ చేస్తున్నాడు స్టైలిష్ స్టార్.
ప్రస్తుతం కేరళలో బన్నీ సినిమాలకు బోలెడంత డిమాండ్ ఉంటుంది. చెన్నై మార్కెట్లోనూ ఈ అల్లు హీరో పట్టు ఎక్కువే. ఇప్పుడు కన్నడ అభిమానులను కూడా బాగానే కవర్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం సరైనోడు యూనిట్ అంతా హైద్రాబాద్ లో తెగ ప్రచారం చేస్తుంటే.. బన్నీ మాత్రం చుట్టుపక్కల రాష్ట్రాలను కవర్ చేసేస్తున్నాడు.