నిన్న రాత్రి జరిగిన 'వరుడు కావలెను' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్, స్టేజ్ పై తనదైన స్టైల్లో సందడి చేశాడు. ఈ సినిమాను గురించి ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారకులు నిర్మాతలు. గీతా ఆర్ట్స్ బ్యానర్ తరువాత నేను హోమ్ బ్యానర్ గా ఫీలైంది చినబాబుగారి బ్యానరే. పేరుకు 'అల వైకుంఠపురములో' అరవింద్ గారు - చినబాబుగారు కలిసి తీసినా, ఎవ్రీ డే వంశీ గారు దగ్గరున్నారు. ఆయన లేకుండా నేను ఆ సినిమాను ఊహించలేను. 'జెర్సీ' సినిమాతో నేషనల్ అవార్డును సంపాదించినందుకు నేను ఆయనను అభినందిస్తున్నాను.
వంశీ చాలా మంచి సినిమాలు తీస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది .. ఆయనతో కలిసి చేస్తున్న ప్రయాణం ఆనందంగా ఉంది. చినబాబు గారు చాలా తక్కువ మాట్లాడతారు .. కానీ చాలా ఎక్కువ ప్రేమిస్తారు. ఆయన ఈ సినిమాకి ఏ స్థాయిలో సపోర్ట్ ఇచ్చి ఉంటారనేది నాకు తెలుసు. నాగశౌర్య చెప్పినట్టుగా బడ్జెట్ విషయంలో 'తగ్గేదే లే' అన్నట్టుగానే ఉండి ఉంటారు. ఈ సినిమాతో పాటు 'రొమాంటిక్' సినిమా కూడా రిలీజ్ అవుతోంది .. ఆ సినిమా టీమ్ కి నేను శుభాకాంక్షలు అందజేస్తున్నాను. నిజానికి ఈ రోజున షూటింగు ఉన్నప్పటికీ నాకు కావలసిన వాళ్ల కోసం ఇక్కడికి వచ్చాను.
ఇంతవరకూ ఎప్పుడూ చూడని ఒక పరిస్థితిని సినిమా ఇండస్ట్రీ చూసింది. అందువలన ఇప్పుడు ఈ సీజన్ సినిమాకి చాలా ఇంపార్టెంట్. తమిళంలో భారీ స్థాయిలో 'అన్నాత్తే' వస్తున్నందుకు కూడా చాలా హ్యాపీగా గా ఉంది. కేరళ .. కర్ణాటక కూడా దార్లో పడే అవకాశాలు కనిపిస్తుండటం ఆనందంగా ఉంది. సమస్యలన్నీ పరిష్కారమవుతున్నాయి .. థియేటర్లకు జనాలు రావడం పెరుగుతోంది. ఈ జోరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హిందీలోను భారీ సినిమాలు వస్తున్నాయి .. బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా బాగుండాలని భావిస్తున్నాను.
ఈ ఏడాది చివరిలో డిసెంబర్ 17వ తేదీన 'పుష్ప' సినిమాతో మేము వస్తున్నాము. మీకు సినిమా నచ్చాలని కోరుకుంటున్నాను. నేను జనరల్ గా సినిమా గురించి కాన్ఫిడెంట్ గా అదీ ఇదీ అని చెప్పలేను. బట్ సినిమా మీకు నచ్చాలని కోరుకుంటున్నాను. కానీ ఒక విషయం మాత్రం చెబుతాను .. పాటలు చాలా బాగా వచ్చాయి. అదైతే మాత్రం నేను చెప్పగలను. ఇంకా రిలీజ్ అవబోతున్న పాటలు కొన్ని బాగుంటాయి" అని చెప్పుకొచ్చాడు. పాటలు బాగుంటాయి గానీ .. సినిమా గురించి ఏమీ చెప్పలేనని బన్నీ అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమా అవుట్ పుట్ పట్ల అసంతృప్తితో అలా అన్నాడా? లేదంటే అంచనాలు పెంచడం ఇష్టం లేక అలా చెప్పాడా? అనేది పెద్ద చర్చనీయాంశమైంది.