అల్లు అర్జున్‌ 'ఐకాన్‌' కంటే ముందు..!

Update: 2021-04-25 10:30 GMT
అల్లు అర్జున్‌ పుష్ప సినిమా పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కాని కొరటాల శివ ఆచార్య పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్‌ తో సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యాడు. వచ్చే ఏడాదికి అల్లు అర్జున్ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. కొరటాల మూవీ వాయిదా పడ్డ నేపథ్యంలో పుష్ప సినిమా తర్వాత బన్నీ చేయబోతున్న సినిమా ఏంటీ అంటే అందరి దృష్టి ఐకాన్ పైకి వెళ్లింది. మూడేళ్ల క్రితం ఐకాన్‌ సినిమా ప్రకటన వచ్చింది. దిల్‌ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్‌ సినిమాను పుష్ప తర్వాత పట్టాలెక్కిస్తారని అనుకుంటున్న సమయంలో మెగా కాంపౌండ్‌ నుండి ఇంట్రెస్టింగ్‌ విషయం ఒకటి అనధికారికంగా బయటకు వచ్చింది.

పుష్ప సినిమా పూర్తి అయిన తర్వాత రెండు మూడు నెలల బ్రేక్‌ తీసుకుని బన్నీ తదుపరి సినిమాను కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేజీఎఫ్‌ 2 ను ముగించి ప్రస్తుతం ప్రభాస్‌ తో సలార్‌ సినిమా ను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్‌ ఇప్పటికే అల్లు అర్జున్ తో సినిమా ను కన్ఫర్మ్‌ అయ్యాడట. అల్లు అరవింద్ తో ప్రశాంత్‌ నీల్‌ కు ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన బ్యానర్‌ లోనే ఈ సినిమాను బన్నీతో చేసేందుకు ప్రశాంత్‌ నీల్‌ ఒప్పుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబో మూవీ ఈ ఏడాది సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ లోనే పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు.

పుష్ప సినిమా షూటింగ్‌ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. కరోనా తీవ్ర ప్రభావం ఉన్నా కూడా పుష్ప ను అనుకున్నట్లుగా పూర్తి చేస్తున్నారు. పుష్ప సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ప్రశాంత్‌ నీల్ మూవీకి అల్లు అర్జున్‌ రెడీ అవ్వబోతున్నాడు. ఇప్పటికే స్టోరీ సిద్దం అయ్యిందని.. గీతా టీమ్ స్క్రిప్ట్‌ వర్క్‌ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. సలార్‌ షూటింగ్‌ తో పాటు బన్నీ సినిమా కోసం స్క్రిప్ట్‌ ను కూడా ప్రశాంత్‌ నీల్‌ చేస్తున్నాడట. మొత్తానికి ఐకాన్‌ కంటే ముందు ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమా చేయబోతున్నాడని మెగా కాంపౌండ్‌ నుండి బలంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News