మొత్తానికి మహేష్ బాబు మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చేస్తోంది. మహేష్ భాగస్వామ్యంలో ఏషియన్ సినిమాస్ వాళ్లు హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో లగ్జరీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల దీపావళికే దీన్ని ఆరంభించాలని అనుకున్నారు. కానీ పూర్తిస్థాయిలో మల్టీప్లెక్స్ అందుబాటులోకి రావడానికి ఆలస్యమైంది. ‘2.0’ రిలీజ్ రోజే ప్రారంభోత్సవం అనుకున్నారు కానీ.. అదీ కుదర్లేదు. చివరికి డిసెంబరు 2న ఆదివారరం ఈ మల్టీప్లెక్స్ ఆరంభం కాబోతోంది.
‘ఏఎంబీ సినిమాస్’ పేరుతో నిర్మితమైన ఈ మల్టీప్లెక్స్ లో ఆల్రెడీ టికెట్ల అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. ‘బుక్ మై షోలో’ అన్ని స్క్రీన్ల టికెట్లు అందుబాటులో ఉంచారు. మహేష్ పేరుతో ముడిపడ్డ మల్టీప్లెక్స్ కావడంతో జనాలు ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. ముఖ్యంగా ఏఎంబీ సినిమాస్ లో ‘2.0’ సినిమాను త్రీడీలో చూసేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
తాజాగా ‘ఏఎంబీ సినిమాస్’కు సంబంధించిన ఫొటోస్ కొన్ని బయటికి వదిలారు. హైదరాబాద్ లో ఇప్పటిదాకా ఇంత లగ్జీరియస్ స్క్రీన్లు ఎక్కడా లేవన్నది స్పష్టం. బయట లోపలా.. యాంబియెన్స్ కళ్లు చెదిరిపోయేలా ఉంది. సీట్లు చాలా లగ్జీరియస్ గా అనిపిస్తున్నాయి. సాధారణ సీట్లతో పాటు రిక్లైనర్లు.. పడుకుని చూసే సీట్లు కూడా ఉన్నాయి. మినిమం టికెట్ రేటు రూ.200గా ఉంది. ఎంచుకునే సీట్లను బట్టి రేటు పెరుగుతుంది. మొత్తం 1650 దాకా సీట్ల కెపాసిటీతో ఏడు స్క్రీన్లు అందుబాటులోకి తెస్తున్నారు. గచ్చిబౌలి ప్రాంతంలోని సినీ ప్రియులకు మరో స్థాయి వినోదం పంచబోతోంది మహేష్ మల్టీప్లెక్స్.