టీజర్ వచ్చిన చాలా రోజుల తరువాత ఫైనల్ గా ''ఆమీ తుమీ'' సినిమా ట్రైలర్ కూడా వచ్చేసింది. ఇంద్రగంటి మోహన్ క్రిష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీ అని ఇప్పటికే అర్ధమైంది. అయితే ఇంతకీ ఈ ట్రైలర్ ఎలా ఉంది? పదండి చూద్దాం.
తనికెళ్ళ వార్నింగ్ ఇస్తుంటే.. ఇది సల్మాన్ ఖాన్ కొత్త స్టెప్పా అని అడగటం.. ఆశ దోశ అప్పడం వడ అంటే మెనూ చెబుతావేంట్రా అనడం.. అష్టాచమ్మాలోని మహేష్ థీమ్ ను జోక్ గా వాడుకోవడం.. ఇవన్నీ చూస్తుంటే ఆల్రెడీ చాలాసార్లు వాడేసిన ఫేస్ బుక్ జోకుల్లా ఉన్నాయ్. నిజానికి టీజర్ తోనే చాలామంచి కథను చెప్పారని చెప్పాలి. ట్రైలర్లో మాత్రం పెద్దగా మ్యాటర్ కనిపించట్లేదు. ఒక యాంగిల్లో చూస్తే.. వెన్నెల కిషోర్ హీరోగా చేసిన సినిమాలో అడివి శేష్ అండ్ ఈషా సైడ్ క్యారక్టర్లు చేశారు అనిపిస్తోంది. తక్కువ బడ్జెట్లో తక్కువ టైములో తీసేశారనే పాయింట్ పక్కనెట్టేస్తే.. ఇప్పుడు కేవలం ఒక రొటీన్ కన్ఫ్యూజన్ కామెడీ తీసినట్లున్నాడు ఇంద్రగంటి.
ఇకపోతే టీజర్ టైములో సింక్ సౌండ్ దెబ్బకి వాయిస్ అంతా లోయలో మాట్లాడుతున్నట్లుంది. ఇప్పుడు మాత్రం ఆ సింక్ సౌండ్ అంతా తీసేసి చక్కగా డబ్బింగ్ చేయించి ట్రాక్ ను వదిలేశారు. అదొక్కటే ఈ ట్రైలర్ కు సేవింగ్ గ్రేస్.