అభిమాన తారలు కనిపించగానే ఎగబడతాం. వాళ్లు కనిపించేవరకు చూస్తూనే ఉంటాం. చేతులూపుతూ విష్ చేస్తాం, మరీ దగ్గరుంటే కరచాలనం చేసేందుకు కూడా ప్రయత్నిస్తాం. కొద్దిమంది అభిమానులైతే తారల వాహనాల వెంట పరిగెడుతూ ఉంటారు. తాజాగా ఓ టైగర్ కూడా అలాగే చేసింది. ఇంతకీ ఆ టైగర్ కి కనిపించిన తార ఎవరో తెలుసా? మన బిగ్ బీ అమితాబ్ బచ్చన్. బిగ్ బీ కి వీరాభిమానేమో తెలియదు కానీ... అడవిలోకి వచ్చిన ఆయన్ని ఏకంగా నాలుగు కిలోమీటర్లు అనుసరించిందట. ఆ విషయాన్ని స్వయంగా ఫేస్ బుక్ లో వెల్లడించాడు అమితాబ్ బచ్చన్. ఆ వివరాల్లోకి వెళితే...
మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమితాబ్ ని పులుల సంరక్షణ ప్రచార కర్తగా నియమించింది. ఇందులో భాగంగా ఆయన మంగళవారం ముంబై సమీపంలోని బోరివలిలోని సంజయ్ గాంధీ వన్యప్రాణుల జాతీయ అభయారణ్యంలో వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అమితాబ్ పులుల నుంచి రక్షణ కల్పించే వాహనంలో కూర్చుని అడవిలో కలియతిరిగారు. ఆ సందర్భంలోనే ఓ పులి అమితాబ్ ని చూసిందట. ఇక ఆయన కూర్చున్న వాహనాన్ని నాలుగు కిలోమీటర్లపాటు వెంబడించిందట. పులులు అలా అడవిలో ఓ వాహనాన్ని అంతదూరం వెంబడించవట. ఇలా అరుదుగా జరుగుతుంటుందట. ఆ విషయాన్ని ఫేస్ బుక్ లో పంచుకొంటూ ఫొటోలు కూడా షేర్ చేశారాయన. అయితే ఆయన అభిమానులు మాత్రం టైగర్ కూడా మీకు వీరాభిమానేమో సర్... అందుకే మిమ్మల్ని అలా అనుసరించిందని అమితాబ్ ని ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. నిజమే కావొచ్చు!!!